విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Brim-Brought

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

Brim, n. s. అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె 
అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *
ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది.
    
Brimful, adj. అంచులమట్టుకు నిండిన.

Brimmer, n. s. నిండిన చెంబు, గిన్నెడు సారాయి.

Brimming, adj. నిండిన. a * cup నిండుగిన్నె .

Brimstone, n. s. గంధకము.

Brinded, Brindled, adj. చారలుగల, పొడలుగల.

Brine, n. s. కారువుప్పునీళ్ళు.

To Bring, v. a. తెచ్చుట, తీసుకొనివచ్చుట, యెత్తుకొనివచ్చుట, పిలుచుకొనివచ్చుట.
he brought an acusation or charge against me నా మీద ఒక వ్యాజ్యము 
తెచ్చినాడు. they brought the ship to వాడను నిలిపినారు. she was brought to bed
బిడ్డ కన్నది. a woman who is brought to bed బిడ్డకనివుండే స్త్రీ. they brought
the matter to a close ఆ పనిని తీర్చినారు, ముగించినారు. To bring the business
to an issue I sued him ఆ పని పైసలా కావడానకై వాడిమీద వ్యాజ్యము వేస్తిని.
when this matter was brought to light ఆ సంగతి బయటపడ్డప్పుడు. his
work was never brought to light అతని గ్రంధము వొక నాడున్ను ప్రసిద్ధపడలేదు.
this brought him to his grave యిందువల్ల చచ్చినాడు. this brought him
to the edge of the grave యిది వాడి ప్రాణాంత్యమునకు వచ్చినది. this
sickness brought him to his end యీ రోగముతో వాడు చచ్చినాడు. he 
brought the estate to the hammer ఆ సొత్తును యేలము చేసినాడు. they brought him
to justice వాడికి శిక్ష అయ్యేటట్టు చేసినారు. after winter the sun brings trees
to life చలికాలము పోయిన తరువాత సూర్యుడివల్ల చెట్లకు ప్రాణములువస్తవి. when
I bring this to mind దాన్ని నేను జ్ఞాపకము చేసుకొన్నప్పుడు.I can not now 
briing it to mind దాన్ని యిప్పుడు జ్ఙాపకమునకు తెచ్చుకోలేను. he brought
them to nothing వాండ్లను బొత్తిగా చెరిపినాడు. this was brought to nothing
అది చక్కబడలేదు. I brought it to his notice దీన్ని అతనికి తెలియచేసినాను.
Extravagance brought him to poverty దూపరదిండితనముచేత దరిద్రుడైనాడు.
this brought him to ruin యిందు వల్ల చెడిపోయినాడు. when he was brought to his
senses వాడికి స్మారకము వచ్చినప్పుడు. he brought the matter to a proper
settlement ఆ సంగతిని పరిష్కరించినాడు. he brought them to terms వాండ్లను
సమ్మతిపరచినాడు. he brought the prisoners to trial ఆ ఖైదీలను విచారణకు
తెచ్చినాడు. he was at legnth brought to confess it తుదకువాడు దాన్ని వొప్పు
కొనేటట్టుచేసినారు. God brought it to pass దేవుడట్లా జరిగేటట్టు చేసినాడు.
he was brought to sell his house వాడికి తన యింటిని అమ్ముకోవలసివచ్చినది.
to bring about సాధించుట, చక్కబెట్టుట. he brought the marriage about
ఆ పెండ్లిని వొనగూర్చినాడు. they brought their enemies down శత్రువులను
సాధించినారు. they brought their enemies down వాడి గర్వము అణిచినారు. to
bring forth కనుట, యీనుట. She brought forth a child అది బిడ్డకన్నది.
the cow brought forth a calf ఆ యావు దూడవేసినది.  he brought forth
the prisoners ఖైదీలను బయటికి తీసుకవచ్చినాడు. to * forth flowers 
పూచుట. to * forth fruits కాచుట. When the goods were brought forth
ఆ సరుకులను బయటపెట్టినప్పుడు. he brought his friends forward తన స్నేహితులను
ముందుకు తెచ్చినాడు. he brought her home దాన్ని యింటికి తీసుకవచ్చి చేర్చినాడు.
he brought the charges home ఫిర్యాదును సాబతుచేసినాడు. the offence was
brought home to him వాడిమీ తప్పు పూర్తిగా రుజువైనది. to bring in లోనికి
తెచ్చుట. they brought him in i.e. into parliament వాణ్ని పార్లెమెంటులో
చేర్చుకొన్నారు. this business brought him in a 1000 Rupees యీ వర్తకములో
వాడికి వెయ్యి రూపాయలు కలిసివచ్చినది. he brought in the kings name often
మాటిమాటికి రాజు పేరును వుదాహరించినాడు. he brought them in contact
వాండ్లకు సంధిచేసినాడు. he brought the two ships in contact ఆ రెండువాడ
లను ఒకటిగా చేర్చినాడు. they brought him in guilty వాడి మీద నేరము 
రుజువైనదన్నారు. they brought me into the business నన్ను ఆపనిలో కలిపినారు.
they brought the land into cultivation ఆ నేలను దున్ని పయిరుచేసినారు.
he brought them into trouble వాండ్లకు శ్రమవచ్చేటట్టుచేసినాడు. I brought him
off వాణ్ని మోసుకొనివస్తిని, వాణ్ని తప్పిస్తిని, వాణ్ని విడుదల చేయించుకొని
వస్తిని. he brought infamy on his family తన కుటుంబమునకు అపకీర్తి తెచ్చినాడు.
to bring out బయటికి తెచ్చుట. he brought out the total wrong తప్పుగా
మొత్తము కట్టినాడు, వెరశి కట్టినాడు. he brought them over in his boat
తన పడవలో వాండ్లను తెచ్చినాడు. he tried to bring me over నన్ను పడవలో
వాండ్లను తెచ్చినాడు. he tried to bring me over నన్ను వుసలాయించవలెనని
చూచినాడు, లోపరచుకోవలెనని చూచినాడు. how could he bring himself to do
this? దీన్ని చేసేటందుకు వాడికి చెయ్యియెట్ల ఆడెనో? As he could not 
birng himslef to do so. అట్లాచేయడానకు వాడికి మనసురానందున. I could
not * myself to dringk the pysic నేనెంత సమాధానము చేసుకొన్నా ఆ మందును
తాగడమునకు నాకు బుద్ధి పుట్టలేదు. he at last brought himself to one meal a-day
తుదకు దినానికి వకసారి భోజనము చేసేటట్టు వాడుక చేసినాడు. how could he bring
himself to say so? అట్లా అనడానకు వాడికి నోరెట్లా ఆడినదో? at last we brought
him to himself తుదకు వాడికిస్మారకము వచ్చేటట్టు చేస్తిమి. he brought them
together వాండ్లందరిని చేర్చినాడు, పోగుచేసినాడు. he brought up his troops
తన సైన్యమును ముందుకు నడిపించినాడు. he brought up the child very properly
ఆ బిడ్డను క్రమముగా పెంచినాడు. the child brought up his dinner ఆ బిడ్డ తిన్న
దాన్ని కక్కినది, వాంతిచేసినది. When he brought up the subject వాడు ఆ సంగతి
ప్రస్తాపము చేసినప్పుడు. bring me word when he comes వాడురాగానే నాకు
సమాచారము చెప్పు.
Bringer, n. s. తెచ్చేవాడు. a * up ముందుకుతెచ్చేవాడు, తర్బియతు చేసేవాడు.

Brinjal, n. s. (the egg.plant) వంకాయ, వార్తాకము.

Brinjarries, (H.) a sort of Gypsies లంబాడివాండ్లు.

Brink, n. s. అంచు, కొన, గట్టు, వొడ్డు, తీరము. I was on the * of falling 
పడకుండా రవంత తప్పితివని. he is on the * of ruin వాడు చెడిపొయ్యేగతిగా
వున్నాడు.

Briny, adj. వుప్పగా వుండే, కారుగా వుండే.

Briony, n. s. ఒక మొక్క పేరు.

Brisk, adj. lively చురుకైన, వడిగల. a * wind చురుకైన గాలి. or gay
ఉల్లాసమైన.

Brisket, n. s. మృగముయొక్క రొమ్ము, రొమ్ము మాంసము.

Briskly, adv. చురుకుగా, వడిగా, ఉల్లాసముగా.

Briksness, n. s. చురుకు, వడి, ఉల్లాసము.

Bristle, n. s. పంది వెంట్రుక. A brush made of bristles వరాహకూర్చము.
the bristles of his his beard బిరుపైన గడ్డము.

To Britle up, v. n. నిక్కపొడుచుకొనుట, రేగుట. he bristled up at these words
యీ మాటలకు రేగినాడు.

To Bristle, v. a. నిక్కపొడుచుట.

Bristiling, adj. నిక్కపొడుచుకొన్న, రేగిన.

Bristly, adj. బిరుసువెంట్రుకలుగల.

Bristol-stone, n. s. పుష్యరాగము, తొవరమల్లి.

Britain, n. s. దేశనామము.  Great * అనగా England, Wales and Scotland 
యీ మూడు దేశములకున్ను సముదాయనామము.

Britannia, n. s. యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *
metal వక తరహా సత్తు లోహము.

British, adj. యింగ్లీషు దేశ సంబంధమైన. * cloth సీమగుడ్డ. the *
Government యింగ్లీషు వారి ప్రభుత్వము.

Briton, n. s. యింగ్లీషువాడు, యిది కావ్యనామము.

Brittle, adj. పెళుచైనది, రవంత తప్పితే పగిలిపొయ్యేటిది. his temper
is * వాడిగుణము పెళుచైనది.

Brittleness, n. s. పెళుచుతనము, వెట్టతనము.

Britzka, n. s. ఒక తరహా బండి.

To Broach, v. a. or Begin మొదలు బెట్టుట, ఆరంభించుట, తెరుచుట, బెజ్జమువేసుట.
to * a cask పీపాయను తెరుచుట, పొడిచి తియ్యడానికి మొదలు బెట్టుట. the cask
was broached yesterday and it is empty to-day ఆ పీపాయను నిన్న తెరిచి 
యెత్తడమునకు మొదలు పెట్టినారు, నేడు ఖాలి అయిపోయినది. or to utter చెప్పుట,
ప్రస్తాపము చేసుట. he broached the subject ఆ సంగతిని ప్రస్తాపము చేసినాడు.

Broad, adj. వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.
It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction between
these two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to go
నన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. he
has a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was
* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు.  It is as
* as it is long యెటైనాసరే, రెండూసరే.

Broad-axe, n. s. గండ్రగొడ్డలి.

Broad-cast, adv. వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములో
విత్తనము వెదచల్లినాడు.

Broad-cloth, n. s. సగలాతు, బనాతు.

To Broaden, v. n. వెడల్పు చేసుట. they broadened the road బాటను వెడల్పు
చేసినారు.

Broadish, adj. కొంచము వెడల్పైన.

Broadly, adv. వెడల్పుగా, విశాలముగా, విస్తారముగా. he news was * spread
ఆ సమాచారము బహుదూరము వ్యాపించినది. these two are * distinguished 
యీ రెంటికిన్ని భేదము విస్తారముగా వున్నది. he pronounced * యాచగా మాట్లాడి
నాడు.

Broadness, n. s. వెడల్పు, విశాలత. 

Broadsie, n. s. వాడయొక్క పక్క. the guns on one side వాడకువకపక్కన 
వుండే ఫిరంగులు. or volley పకపక్క ఫిరంగులను వకఫళితాకాల్చడము.
this was printed upon a * and was stuck on the wall దాన్ని పై పొరటన
వ్రాశి గోడకు అంటించబడ్డది.

Broadsword, n. s. పట్టాకత్తి.

Broadwise, adv. అడ్డముగా.

Brobdignag, n. s. రాక్షసదేశము, అక్కడి జనులు తాటిచెట్లంతపొడుగు వున్నారని
కథ.

Brocade, n. s. సరిగెబుట్టా వేసినపట్టు. gold brocade బంగారు తగిడి; 
బంగారు బుటేదారి పట్టు.

Broacaded, adj. అలంకరించిన.

Brocure, n. s. (a French word) కట్టిన చిన్నపుస్తకము.

Brock, n. s. ఒక జంతువు పేరు, అనగా. Badger.

Brocoli, n. s. ఒక తరహా తోటకూర.

Brogue, n. s. a kind of shoe ఒక తరహా మోటు చెప్పులు. corrupt
dialect యాచమాటలు.

To Broider, v. a. పువ్వులు వేసుట బుట్టాలు వేసుట.

Broidery, n. s. పువ్వులు వేసేపని, బుట్టా పని.

Broil, n. s. జగడము, కలహము, కలత, అల్లరి. roasted meat కాల్చిన మాంసము.

To Broil, v. a. మాంసమును కాల్చుట. a broiling-heat మలమలమాడ్చే యెండ.

                              
                                            
                                                                           
                  
             
  
       
                                                                                                 
                   
నక్షత్రము యొక్కగాని స్థానమును నిర్నయించ డానకై కల్పించిన
చక్రవిశేషము, జ్యోతి స్సంబంధమైన యంత్రవిశేషము.

Broke, the past of Break, See To Break,


Broken, adj. పగిలిన, విరిగిన, తెగిన, చిట్టలిన, చితికిన. a *
wall యిడిసిన గోడ. a * rope తెగినతాడు. her speech was * with
sighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది. * pieces of
stone జల్లి, జల్లపొడి. * victuals తిని మిగిలినది. మిగిలిన
వుచ్ఛిష్టము, యెంగిలి. he speaks * English వాడు అభాస
యింగ్లీషు మాట్లాడుతాడు. I had some * sleep నాకు నిద్రపట్టీ
పట్టక వున్నది. * ground మెరకాపల్లముగా వుండేభూమి. the captain
was broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు. a *
down horse డీలైపోయిన గుర్రము. a * knee'd horse మోకాలు
విరిగిన గుర్రము. that merchant has broken వాడు దివాలా
యెత్తినాడు. * hearted కుంగిన. heart * damsels వ్యసనముతో
కుంగిన పడుచులు. a heart * with grief వ్యసనముతో కుంగిన,
మనోవ్యాధితో కుంగిన. a * old man వుడిగిన ముసలి వాడు. * in or
trained మరిపిన, అలవరించిన. the work is * off   సంభాషణ
నిలిచిపోయినది. * periods చిల్లర దినములు. a * winded horse
రొమ్ము పగిలిన గుర్రము. a * down gentleman ఆయుష్యదూరుడు,
కులభ్రష్టుడు. * grain నూకలు.

Broker, n. s. తరగిరి, అడతీదారుడు, దలాలి. 

Brokerage, n. s. తరుగు, అడతి.

Broking, n. s. తరగిరితనము.

Bronchial, n. s. కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలో
వుండే పెద్దనరము.

Bronchocele, n. s. గండమాల రోగము.

Bronze, n. s. ఒక తరహా కంచు. * colour మడ్డి పచ్చవర్ణము,
గుడ్డిపచ్చవర్ణము, ముదురుమామిడాకువన్నె.

Bronzed, adj. కందిన, కమిలిన. his face was * with the sun
యెండచేత వాడి ముఖము కమిలినది.

Brooch, n. s. ఒక భూషణము, పతకము.

To Breed, v. a. to sit on eggs గుడ్లు పొదుగుట. to * over
తలపోసుకొనుట, చింతించు, ఆలోచించుట.

Brood, n. s. పిల్లలు, పక్షిపిల్లలు, సంతానము. a * hen
పిల్లలకోడి. A * of chickens ఒక కారు కోడిపిల్లలు.

Brook, n. s. చిన్ననది, కాలువ.

To Brook, v. a. సహించుట, తాళుట. Unable to * such conduct
అలాగంటి నడకను సహించలేక.

Broom, n. s. చీపురుకట్ట, పొరక్కట్ట. name of a flowering
shrub తంగేడు వంటి వకచెట్టు.

Broomstick, n. s. కర్ర, దుడ్డుకర్ర.

Broth, n. s. చారు, నీచునీళ్లు, మాంసమువేసి కాచినచారు. Barley
* బార్లి గంజి.

Brothel, n. s. లంజలువుండే యిల్లు, లంజల గుడిశె.

Brother, n. s. తోడబుట్టినవాడు,సహోదరడు. elder * అన్న,
Younger * తమ్ముడు. half brother తల్లివొకతె తండ్రులువేరైన
సహోదరులు, తండ్రి వొకడు తల్లులువేరైన సహోదరులు. he consulted
with his * workmen తన తోటి పాటిపనివాండ్లతో యోచించినాడు. My *
servants నా తోటిపాటి పనివాండ్లు, నా సరి వుద్యోగస్థులు. "An
attorney cannot live but by excluding from his confidence
his * attorney" (Sumati) కరణము తనసరికరణము, మరి నమ్మకమర్మమీక
మనవలె సుమతీః

Brotherhood, n. s. బరాబరి, సభ, వర్గము, తెగ. * of thieves
దొంగలతెగ. * of monks సన్యాసుల గుంపు.

Brother-in-law, n. s. బావమరిది. either a man's sister's
husband or wife's brother బావమరిది. if older than one's self
బావ. if younger than one's self మరిది. joint
brothers-in-law; or, husband of the wife's sister షడ్డకులు.

Brotherly, adj. సహోదర సంబంధమైన. * affection సహోదర
వాత్సల్యము.

Brought, the past and p|| of Bring తెచ్చినది, తెచ్చిన. See To Bring.