విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Brow-Burly
స్వరూపం
Brow, n. s. కనుబొమ. * of a hill కొండ యొక్క శిఖరము. he lived under the * of a hill కొండకింద నివాసము చేసినాడు. he lives by the sweat of his * నొసటి చమటను వూడ్చివేసి బ్రతుకుతాడు. To Browbeat, v. a. వురిమి చూచుట, గద్దించుట. Browbeating, n. s. గద్దింపు, బెదిరింపు, భర్జన. Brown, adj. చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము, తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణము వేయనితోలువన్నె, టేకువన్నె, కిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగి వన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddish colour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity * కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but he was in a * study and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికి వినలేదు. Brownish, adj. మసరవన్నె గల, కోరా వన్నెగల, కొంచెము యిటికె వణ ్మైన. Brownness, n. s. కపిలవణ ్ము. See Brown. To Browse, v. a. ఆకుమేసుట, అనగా ఒంటె, యేనుగ, మేక, మొదలైనవి చెట్టుమీద ఆకు మేసుట. Bruin, n. s. వెలుగుబంటికి పెట్టుపేరు, కోతికి తిమ్మన అన్నట్టు. To Bruise, v. a. నలగగొట్టుట, చిదగగొట్టుట. I bruised my hand నాచెయ్యి నలిగింది. In falling down I bruised my arm పడి భుజము తోలు దోక్కొనిపోయినది. he bruised the tin pot by letting it fall ఆ చెంబు పడి చొట్టపోయినది. or pound దంచుట, తొక్కుట. he bruised the garin వడ్లను దంచినాడు. Bruise, n. s. నొక్కు, సొట్ట, దోగుడు. Bruised, adj. నలిగిన, చిదిగిన, దంచిన, దోగిన. * rice దంగుడుబియ్యము, దంచిన బియ్యము. Bruit, n. s. వదంతి, గాలి సమాచారము. Bruited, adj. వదంతిగా వుండే. Brumal, adj. Wintry, చలికాల సంబంధమైన. the * quarter చలికాలము. Brumette, n. s. (A French word) యింగ్లీషువాండ్లలో కౌంచము చామని చాయగా వుండే స్త్రీ, ఈషద్గౌరవణ ్ స్త్రీ. Brunt, n. s. దెబ్బ, వురిపడి, వేగము. they put bundles of straw between teh boats to bear the * పడవలు ఒకటితో ఒకటి కొట్టుకోకుండా నడమ కసువు మోపులు వేస్తారు. If any thing goes wrong he will bear the* యేదైనా వ్యత్యాసము వస్తే ఆ దెబ్బను వాడు నిభాయించుకొనిపోను. Brush, n. s. బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth * పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. or fox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్ను మాకున్ను కొంచెము యుద్ధమైనది. To Brush, v. a. తుడుచుట, బురుసుతో తుడుచుట. he brushed his hair బురుసుతో తల దువ్వు కొన్నాడు. the act brushes her coat with her paws పిల్లి తన కాళ్లతో వొంటిని తుడుచుకొంటుంది. the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతో నాముఖముమీద కొట్టినది. the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతో నాముఖముమీద కొట్టినది. She brushed the dust off her grown తన బట్ట దుమ్మును దులిపినది. he brushed up the account ఆ లెక్కలను సవరించినాడు. he brushed up the house against the marriage ఆ యింటిని పెండ్లికి శృంగారించినాడు. To Brush, v. n. తాకుట, తట్టుట, కంబితీసుట, పారిపోవుట. he brushed aong the road ఆ భాటను పారిపోయినాడు. he brushed off కంబి తీసినాడు. he brushed past me నా పక్కన దూరి పోయినాడు. the ship brushed upon a sand band ఆ వాడ యిసుదిబ్బమీద తాకినది, కౌట్టుకొన్నది. Brushwood, n. s. గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundle of * కంపుమోపు. Brutal, adj. savage, coarse పశుప్రాయమైన, క్రూరమైన, నిఘ్గరమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు. Brutality, n. s. పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్మకత్వము, నిష్టురమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు. Brutality, n. s. పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్తకత్వము, నిష్ఠురత్వము. To Brutalize, v. a. పశుప్రాయుణ్నిగా చేసుట, భ్రష్ఠుచేసుట, అసభ్యపరచుట. Drunkenness brutalizes men తాగడముచేత మనుష్యులు పశుప్రాయులౌతారు. Brutalized, adj. పశుప్రాయమైన, భ్రష్టైన, అసభ్యమైన. Brutally, adv. క్రూరత్వముగా, పశుప్రాయముగా, నిర్దయగా. Brute, n. s. మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు, క్రూరుడు, కిరాతకుడు. Brute, adv. పశుప్రాయమైన, జ్ఙానహీనుడైన, క్రూరమైన. Brutish, adj. పశుప్రాయమైన, కఠినమైన, క్రూరమైన. ignorent తెలివిమాలిన, మోటు, యెడ్డె. they lived in * ignorance పశుప్రాయులై యెడ్డె తనముగా నుండిరి. Burutishly, adv. పశుప్రాయముగా, యెడ్డె తనముగా, మడ్డి తనముగా. Savagely క్రూరముగా. Brutishness, n. s. పశుప్రాయత, మూఢత్వము, జడత్వము. Bryony, n. s. యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plant resembles the yam. Bubble, n. s. నీరుబుడ్డ, బుద్బుదము. this life is a mer * యీ జన్మము వట్టిమాయ. A vain project వట్టిమాయ, వట్టి బూటకము. To Bubble, n. s. నీరుబుడ్డ లేచుట. the water bubbles in boiling నీళ్లు కాగడములో బుడ్డలు లేస్తునవి, నీళ్లు పొంగుతున్నది. A bubbling stream బుడబుడమని పారే ప్రవాహము. To Bubble, v. a. (delude) మోసముచేసుట. Bubby, n. s. చన్ను, కుచము. యిది ఆడగూడనిమాట. Bubo, n. s. వడిశెగెడ్డ, అడ్డకర్రలు. Buccaniers, n. s. అమిరిగా దేశపు వాడ దొంగలు, వాడను దోవకట్టి దోచే దొంగలు. Bucephalus, n. s. అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు, ఉచ్చైశ్రవ మనవచ్చును. Buck, n. s. the male of deer, rabbits & c. మగది, దుప్పి, చెవులపిల్లి మొదలైన వాటిలో మగది. అడవి మూడున్ను వుండినవి. or handsome fellow సొగసుగాడు. Buck-basket, n. s. చాకలవాడి గంప. Bucket, n. s. బాల్ది, నీళ్లుచేదేకొయ్య తొట్టి. made of iron యేతపుబాన. made of leather బొక్కెన, మోటబాన. Buckle, n. s. The English word alone is used బొక్లిసు, కొండి, చిలుక. To Buckle, v. a. బొక్కిలీసు తగిలించుట, కొక్కి తగిలించుట. he buckled the saddle on జీనిని బొక్కిలీసుతో బిగించినాడు. To Buckle to, v. n. చేసుకొనుట, ప్రవర్తించుట. Buckler, n. s. కేడెము, డాలు. Buckram, n. s. బంధనలేక, మైనముతో అంటించి బిర్రుగా వుండేగుడ్డ. Buckskin, n. s. మృగచర్మము, కృష్ణాజినము, జింగతోలు. he wore buckskins జింక తోలు చల్లడమునే వేసుకొన్నాడు. Buckthorn, n. s. వేపచెట్టు వంటి వకచెట్టు. Buckwheat, n. s. ఒక తరహా గోధుములు. Bucolic, n. s. గోపికాగీతల భేదము. Bud, n. s. మొలక, అంకురము. of a flower మొగ్గ. his hopes were nipped in the * వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి. To Bud, v. n. మొగ్గపెట్టుట, మొగ్గయెత్తుట, చిగురు పెట్టుట, మొలక యెత్తుట. Budding, adj. చిగిరించే, మొగ్గలు పెట్టే. a * fruit పూ పిందె. To Budge, v. n. తొలుగుట, వొత్తుట, కదలుట. I desired him to make room but he would not * తొలగమంటే తొలగడు. Am I to * for him వాడికై నేను లేచిపొయ్యేదా, తొలిగి పోయేదా. Budge, n. s. బొచ్చు. Budgerow, n. s. పెద్ద సవారి పడవ. Budget, n. s. సంచి, జోలె, జోల్నా, మూట, కట్ట. I have got a * of news for you నీకు చె ప్పవలసిన సమాచారములు నిండావున్నవి. నీతో వగగంపడు సమాచారములు నిండా వున్నవి, నీ తో గంపెడు సమాచారములు చెప్పవలసి యున్నది. the minister produced his * మంత్రి తన దస్త్రమును దాఖలు చేసినాడు. Buff, n. s. Leather యెనుము తోలు. Yellowish colour కొంచెము పసువువణ్నము, యెండు వెదురువణ్నము. a * coat తోలు వుడుపు. he was in * or naked వాడు దిగంబరముగా వుండినాడు. Buffalo, n. s. Female or she * యెమము, బర్రె. male or he * యెనస పోతు, దున్నపోతు. a wild * అడవిదున్న, కారుబోతు, the young female that has not yet calved పడ్డ. a * calf గేద. బర్రె దూడ. * milk యెనప పాలు. Buffet, n. s. A blow గుద్దు. Beaufet or sideboard శృంగారించిన పక్కమేజ, యిది పాత్రలు వంచడానకు మాత్రము వుపయోగమైనది. they went to buffets గుద్దులాడిరి. To Buffet, v. n. గుద్దులాడుట. he buffeted with the waves అలలతో పోరాడి యెదురు యీదినాడు. he buffeted with many difficulties or with the world వాడు అనేక పాట్లు పడ్డాడు. To Buffet, v. a. కొట్టుట, గుద్దుట. Buffeting, n. s. గుద్దులాట పోరాట. Buffoon, n. s. హాస్యగాడు, పరియాచగాడు. Buffoonery, n. s. హాస్యము, పరిహాసము. Buffy, adj. కొంచెపు పసుపువణ ్మైన, ఈషత్పీతవణ ్మైన. Bug, n. s. వల్లి, మత్కుణము. Bugbear, n. s. వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి, Prosody was the great * to those who attempted the study of Telugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగా వుండెను. Buggy, n. s. a gig వొంటి గుర్రపు బండి. Buggy, adj. నల్లులు పట్టిన. Bugle, n. s. కొమ్ము, వకతరహా తుతారా. Bugles, or, black shining beads దొరసాన్లు బట్టలమీదపెట్టి కుట్టే ఒక తరహా నల్ల పూసలు. To Build, v. a. కట్టు. to * a wall గోడవేసుట, గోడలేపుట. to * a wall గోడవేసుట, గోడలేపుట. to * a ship వాడచేసుట he built castles in the air గొంతెమ్మ కోరికలు కోరినాడు. he built the beam into the wall ఆ దూలమును గోడలో పొదిగినాడు. I built upon his promise వాడి మాటను నమ్ముకొని వుంటిని. Build, n. s. or shpae ఆకారము, నిర్మాణము. Builder, n. s. కట్టేవాడు, నిర్మాణము చేసే వాడు. A coach * బండ్లు చేసేవాడు. Building, n. s. కట్టడము, యిల్లు. Built, the past and p// of Build కట్టినది, నిర్మించిన. Bulb, n. s. or knot, a round body or roof గుండ్రవైనది గ్రంధి, ముడి, కాయ, గుడ్డ. the * of the throat గొంతుకాయ. Bulbous, adj. గుండ్రముగా వుండే. Onions &c. are * roots వుల్లిగడ్డ మొదలైనవి గుండుగా వుండేటివి. Buifinch, n. s. గోరింకవంటి వకతరహా పక్షి. To Bulge, v. n. వుబ్బుగా వుండుట, వుబికి వుండుట. there was a part bulging out of the wall గోడలో ఒకచోట వుబ్బుగా వున్నది. See how hill belly bulges out వాడిపొట్ట యెట్లా వుబ్బుకొని వున్నదో చూడు. Bulk, n. s. లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము. On account of the * of the book పుస్తుకము గొప్పదిగనక. From his * the horse could not carry him వాడి స్థాల్యానికి వాణ్ని ఆ గుర్రము మోయ నేరదు. This illness diminished his * యీ రోగముచేత వాడి వొళ్లు కరిగింది. the majority or greatest part అధికాంశము. Some of them are Musulmaus but the * of them are Hindus వాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు. the bulk of his books are old ones వాది పుస్తుకములలో ముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the * వాడు పత్తిని మొత్తముగా అమ్మినాడు. the sample is superior to the * మాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు. the ship broke * వాడ సరుకు కొంత దిగింది. the projecting part of a building ; a terrace called pial or pyall at Madras తిన్నె . Bulkiness, n. s. లావు, గాత్రత, బృహత్వము, స్థాల్యము. From the * of the book పుస్తుకము లావైనందున. Bulky, adj. లావైన, గాత్రమైన, స్థూలమైన. a * man లావాటి వాడు. Cotton is more * than iron దూది నిండా పట్టేటిది యినుము కొంచె ములో యిమిడేటిది. Bull, n. s. యెద్దు, వృషభము. Bulls plu. యెడ్లు. a wild * గొరపోతు. * calf కోడె, కోడె దూడ. The sacred * or Apis నంది, నందికేశ్వరుడు. a Papel * పోపు యొక్క ఆజ్ఙా పత్రిక అనగా ఆచార్యుల శ్రీముఖము. In composition గజ. thus, a * trout, a * finch, a * dog &c. గజ, పెద్ద. as, the great lime గజనిమ్మ పండు. a * frog గోదురుకప్ప, అనగా పెద్దకప్ప. a * beggar గజదొంగ. a bull's eye or window గవాక్షి. the bull's eye in a target బాణములు వేసే గురిపలకలో వుండే నడిమిచుక్క. he took the * by the horns సాహసము చేసినాడు. or blunder మాటలలో పొరబాటు, అనగా he spent all the money and gave the rest to his borther రూకలనంతా శెలవు చేసి వేసి కడమను అన్నకు యిచ్చినాడు, యీ వాక్యములో, రూకలనంతా, అన్న తరువాత, కడమ అనడము మిక్కిలి అసంభవము గనుక దీన్ని యింగ్లీషు వారు. Bull అంటారు. Or in English they sat down forming a sort of semicircle round me (This occurs in a modern traveller). When this horse goes down hill he stumbles and when he goes up hill he stops (Johnson himslef made this bull : See Boswell. VIII. 324) One of the most remarkable is Had you but seen these roads before they were made you would hold up your hands and bless marshal Wade 1-Milton Prose 12. 1.92 uses Bull for Blunder. Bullace, n. s. కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు. Bull-baiting, n. s. వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లు పెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము. Bull-dog, ఒక తరహా పెద్ధ కుక్క. Bullet, n. s. తుపాకి గుండు. to play at long bullets పిరంగి గుండ్లతో ఆట్లాడుట. Bulletin, n. s. ప్రసిద్ధ, పత్రిక, ప్రకటన పత్రిక. Bullion, n. s. పాళము, ఖడ్డి, యిది వెండి బంగారును గురించిన మాట. gold * బంగారుఖడ్డి, బంగారు పాళము. silver * వెండి ఖడ్డీ, వెండిపాళము. epaulettes are made are of * దండు దొరల భుజాభ, రణములు వెండి బంగారుతో చేయబడుతవి. Bullock, n. s. యెద్దు. a * load పెరికె . Bullock heart apple, n. s. రామాఫలము. Bully, n. s. గద్దించేవాడు, గుడ్డిబెదిరింపులు, బెదిరించేవాడు. జంభాలఖోరు, ఉత్తర కొమార ప్రజ్ఙలు పలికేవారు, రౌష్టుచేసేవారు. To Bully, v. a. బెదిరించుట, గద్దించుట, బుడ్డ బెదిరింపులు, బెదిరించుట, ధాము ధూము చేసుట, జంభాలుకౌట్టుట, రొస్టుచేసుట. Bullying, n. s. గుడ్డిబెదిరింపు, రొష్టు. Bulrush, n. s. జమ్ము జంబు. Bulwark, n. s. కొత్తళము, బురుజు. metaphorically రక్షణము, కాపు. Bum, n. s. ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి. Bum, n. s. బంట్రోతు, అప్పులవాండ్లకు పట్టే వక తరహా నీచ బంట్రోతు. Bumboat, n. s. వాడవాండ్లకు కావలసిన వెచ్చము తీసుకొని పొయ్యేపడవ. Bump, n. s. దద్దు, దద్దరింపు, బొడిపి, బొప్పి. To Bump, v. n. కొట్టుకొనుట. the water being low the boat bumped on the sand నీళ్లు తక్కువగా వుండినందున పడవ నేలకౌట్టుకుంటూ వచ్చినది. Bumper, n. s. సారాయి నిండా వుండేగిన్నె. Bumpkin, n. s. పల్లెటూరివాడు, మడ్డి, యెడ్డెవాడు, యెద్దుమొద్దు. Bun, n. s. A kind of tweet-bread ఒక తరహా మిఠాయి. ఉపవాసదినములలో తినే ఫలాహారము. Bunch, n. s. cluster గుత్తి గొత్తు. of fruit గెల. a * rasins or grapes దాక్షగొల. a * of flowers పూలగుత్తి. the Hindus wear their hair in a * on the back of their heads హిందువులు జుట్టు పెట్టుకొంటారు. a * of keys బీగము చెవులగుత్తి. A camel that has two bunches వీపులో రెండు మిట్టలుగలవొంటె . the * on the shoulders of a bull మూపురము. Bunchy, adj. గెలవలెవుండే, గొత్తుగావుండే. Bundle, n. s. కట్ట, మూట, మోపు. To Bundle up, v. a. కట్ట కట్టు, మూటకట్టుట, మోపుకట్టుట. Bung, n. s. సీసాయిబిరడ. Bungalo, n. s. A kind of house బంగళా. Bunghole, n. s. బీపాయినోరు. To Bungle, v. a. and v. n. అబందరచేసుట. he did it isn a bungling manner దాన్ని అబందరగా చేసినాడు. Bungler, n. s. అబందరగాడు. Bunn, n. s. A kind of sweet bread ఒక తరహా మిఠాయి, ఉపవాస దినములలో తినే ఫలహారము. Bunter, n. s. తొత్తు. Bunting, n. s. Cloth of which flags are made జండా కుట్టే వకతరహా సన్నకంబళి. Buoy, n. s. బొయాకట్టె, లంగరు గురుతు, లంగరు మొదలైనవి మునిగిపోయినచోటు గురుతు తెలిసే నిమిత్యమైనవి తేలికగా వుండే కొయ్యకణతలకు బరువుకట్టి నీళ్లల్లోవేసిన గురుతు. the fisherman watch-ed the buoy చేపలు పట్టేవాడు బెండుమీదనే కన్ను పెట్టివుండినాడు. To Buoy up, v. a. తేలవిడుచుట, ఆదరించుట. his words buoyed up my hopes వాడి మాటలవల్ల నాకు ఆశకలిగినది. Buoyed up, adj. తేలికైన, తేలే. Buoyancy, n. s. తేలిక, లఘిమా. On account of the * of the wood కొయ్య తేలికై నందున. * of mind ఉల్లాసము. Buoyant, adj. తేలికైన. * his spirits are * వాడికి వుల్లాసముగా వున్నది. the corpse be came * and floated ఆ పీనుగ బెండుబడి పైకి తేలినది. Bur, n. s. అంట్రింతలు. Burden, n. s. బళువు, భారము, మోపు. * carried on the head నెత్తిమూట, నెత్తిబరువు a ship of great * పెద్దవాడ, విస్తారము బళువు మోసేవాడ. the family was a great * to him యీ సంసారము వాడికి తల మోపుగా వుండెను. * of a chorus పల్లసి. the * in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ. the * in Psalm 136 is "For his mercy endurech for ever." Life become a * to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను. the * of grief దుఃఖభరము. Lest she should sink under the * of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది. To Burden, v. a. బళువెక్కించుట,మోయించుట,మోపేటట్టు చేసుట. he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు. * not thyself above thy power మోయలేని బళువును పై వేసుకోక. Burdened, adj. బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ. afer the ship was * యెక్కించిన తరువాత. after the ship was * వాడకు బళువుయెక్కిన తరువాత. being * with sorrow దుఃఖభరితుడై. being * with debts అప్పుల తొందరగలవాడై. Burdensome, adj. దుఃఖకరమైన, ఆయాసకరమైన. Burdock, n. s. ఒక మొక్కపేరు, పెద్ద ఆకులుగల ఒకతరహా ముండ్లచెట్టు. Bureau, n. s. బీరువ. or closit రాజు యొక్క అంతరంగసభ. cabinet council రాజు యొక్క అంతరంగాలోచన. he was admitted into the * వాడు రాజుకు అంతరంగ రాయస గాడైనాడు. the king was his friend but he was crushed by the bureaucracy రాజు అతనికి అనుకూలు డైనప్పటికిని అంతరంగ రాయసగాడి ముందర వాడి పని సాగలేదు. Burgamot, n. s. See Bergamot. Bergeois, n. s. a particular size of printing letter ఒక తరహా అచ్చు అక్షరములు. Burgess, n. s. నగరవాసి, వకతరహా మిరాసిదారుడు, పెద్దకాపు. Burgh, n. s. పురము, వూరు, కసుబా. Burgher, n. s. పురవాసి, మిరాసీదారుడు. Burglar, n. s. కన్నపుదొంగ, కన్నగాడు. Burglary, n. s. కన్నపు దొంగతనము. he committed * కన్నమువేసినాడు. Burgomaster, n. s. వూరిపెద్ద. Burgundy, n. s. the name of a country ఒక దేశము యొక్కపేరు. a wine ఆ దేశములో ద్రాక్షరసముతో చేసిన సారాయి. Burial, n. s. వూడ్చడము, భూస్థాపనము, సమాధిచేయడము. were you at you * అతణ్ని భూస్థాపన చేసిన్నప్పుడు నీవుంటివా. Burial-place, n. s. పూడ్చేస్థలము, సమాధిస్థలము, స్మశానము, రుద్రభూమి. Burial-service, n. s. భూస్థాపన మంత్రములు. Buried, adj. పూడ్చిన, సమాధిచేసిన, భూస్థాపితము చేసిన. * in darkness అంధకాషగ్రస్తులైన. their origin is * in darkness వాండ్ల పుట్టుపూర్వోత్తరము తెలియలేరు. he was * in thought తదేకధ్యాసముగా వుండినాడు. Burine, n. s. ముద్రచెక్కే శలాకు. To Burk, v. a. రహస్యముగా చంపి పూడ్చివేసుట. they burked his letter అతని జాబుని మాయచేసినారు. Burker, n. s. రహస్యముగా చంపివేసినాడు. Buriesque, adj. పరిహాసమైన, హాస్యమైన, యెగతాళియైన. Buriesque, n. s. యెగతాళి, పరిహాసము. To Burlesque, v. a. హాస్యముచేసుట, పరిహాసముచేసుట, యెగతాళిచేసుట. Burletta, n. s. ఒక తరహానాటకము. Burly, or Big లావాటి, స్థూలదేహియైన. or Blustering బుడ్డబెదిరింపులు బెదిరించే.