విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Burn-byword
స్వరూపం
To Burn, v. a. కాల్చుట, తగలబెట్టుట. to * to ashes బూడిదచేసుట, భస్మముచేసుట. to * black మాడ్చుట. She burned the rice in cooking మండడములో వణ్నమును మాడగొట్టింది . caustic burns the skin కారము తోలును తిని వేస్తుంది. to * incense దూపమువేసుట. the sun hurns the face యెండచేత ముఖము కములుతుంది. Peoper hurns the tongue మిర్యాలు కారముగా వుంటుంది. to * the dead సంస్కారము చేసుట, దహనము చేసుట. the place where they * bodies స్మశానము. my Borse being lame I burned or fired his leg గుర్రము కుంటినందున కాలిలో వాత వేసినాను. they killed the pig and burnt off the hair పందిని చంపి వెంట్రుకలు మాడ్చి తీసివేసినారు. To Burn, v. n. కాలుట, మండుట, తలగబడుట, దహించుట. the flame burns brikht జ్వాలలు వేస్తున్నది. the lamp burns దీపము మండుతుంది. the oils bas buaned away నూనె యిగిరిపోయినది, క్షయించినది, యీడ్చుకొని పోయినది. the lamp has burnt out దీపము నుండి ఆరి పోయినది. while he was hurning with fever జ్వరము కాస్తూ వుండగా. the sore burns పుండుమండుతున్నది. he was burining with rage కోపముతో మండిపోతూ వుండెను. he was burning with lust మోహములో పడితపిస్తూ వుండెను. his bosom burnt to disobery. తిరగబడడానకు ఆతురపడతూ వుండెను. Burn, n. s. నిప్పుగాయము, కాలిన గాయము. Burning, n. s. కాలడము, మండడము, దహనము, కాక, మంట, తాపము. or actual cautery రక్ష, వాత. the * of woman with her husband's corpse సహగమనము. there were some heart burinings between them వాండ్లకు పరస్పరము చలము వుండెను. Burning, adj. కాలే, మండే, తపించేచేసే, the * hear of he sun మలమలమాడ్చే యెండ. a * wind నిప్పు, గాలి. they were * for revenge కసిదీర్చుకోవలెనని మండిపడుతూవుండిరి. Bruning coal, n. s. కట్టె నిప్పు, అంగారము. Burning place, n. s. స్మశానము. Burning sensation, n. s. మంట. Burning-glass, n. s. సూర్యకాంత అద్దపుబిళ్ల, యెండలోపట్టితే నిప్పుబడే అద్దపుబిళ. To Brunish, v. a. మెరుగు బెట్టుట, చికిలిచేసుట. Burinish, n. s. మెరుగు, చికిలి. Burnished, adj. మెరుగుబెట్టిన, చికిలిచేసిన, తళతళమని మెరిసే. the wings of the fly are * యీగె యొక్క రెక్కలు నిగనిగలాడుతవి. Burnt, adj. కాలిన, మండిన. Rice * in cooking మాడు. my mouth is all *(as with lime * c.) నా నోరంతా పొక్కిపోయినది. land that it burnt up by the sun యెండచేత మాడిపోయిన భూమి. a place where bodies are * స్మశాన భూమి. * offering యజ్ఙము, హోమము. Burr, n. s. అంటింతలు, చికిలింతగడ్డి. they stuck to him like burrs వాణ్ని అంటింతలు వలె కరుచుకొన్నారు, తగులుకొన్నారు. also the * tree or Banyan tree మర్రిచెట్టు. Burrow, n. s. బొక్క, బొరియ, కలుగు, బిలము. To Burrow, v. n. వాసము చేయడమునకై, బౌక్కచేసుట, కలుగుచేసుట, యిది యెలుకలు, పందికొక్కులు, చెవుల పిల్లులు మొదలైన వాటిని గురించి మాట. crahs * in banks యెండ్ర కాయలు గని మలలో బొక్కలు చేసుకొని వుంటవి. Bursar, n. s. ఖజానిజి, పాఠశాల బొక్కసగాడు, పాఠశాలలో చదివేవాడు. To Burst, v. a. విచ్చుట, విరుసుట, పగలుట, పిగులుట, చిట్లుట, పెట్లుట. the pot * in pieces ఆ కుండ తునక తునకలుగా పగిలి పోయినది. his boots * వాడి బూట్సులు పిగిలి పోయినది. When the boil * పుండు చితకగానే, గెడ్డ పగలగానే. the tank * చెరువుకట్ట యెత్తు కొని పోయినది. the river bursts into my lands ఆ యేరు తెంచుకొని నా నేలమీదికి వస్తున్నది. A fire burst out in the Town ఆ వూరిలో అగ్ని భయము కలిగినది. when the sun burst out సూర్యబింబము కనబడగానే. If you strike a flint, fire bursts out చక్కిముక్కి రాతినికొట్టితే నిప్పు పడుతున్నది. he * out in anger రేగినాడు. she * out a laughing పక పక నవ్వినది. she * out a crying భోరున యేడ్చినది. she * into tears యేడ్వ సాగింది. A war * out ఒక యుద్ధము ఆరంభమైనది. when this in tellingence * upon him పిడుగుపడ్డట్టు యీ సమాచారము వాడికి రాగానే. when the village * on my sight ఆ వూరు నాకండ్లకు అగుపడగానే. I was bursting with eagerness to see them వాండ్లను యెప్పుడు చూ తుమా అని అతురపడుతూ వుండినాను. To Burst, v.a. పగలకౌట్టు, తెంచుట. he * his bands కట్లను తెంచుకొన్నాడు. the covects * their prison ఖైదీలు జయిలులోనుంచి తప్పించుకొని పరుగెత్తి పోయిరి. they * open the door తలుపును పగులకౌట్టి తెరిచినారు. he * his boots in walking నడవడములో వాడి బూట్సులు పిగిలిపోయినవి. Brust, n. s. దెబ్బ, ఆకస్మీకమైన దెబ్బ, a * of thunder దడీలున వచ్చిన వురుము, a * of rain దడీలున వచ్చిన వాన. there was a great * of laughter పకపక నవ్విరి. Burst, past and part. చితికిన, చిట్లిన, విరిసిన, పగిలిన. the bank that was * తెగిన కట్ట. Burthen, adj. బళువు, భారము. See Burden. To Bury, v. a. పూడ్చుట, పాతిపెట్టుట, భూస్థాపితము చేసుట. to hide or cover దాచుట, మరుగుచేసుట. It was buried in oblivion అది యన్నడో మరిచిపోయినది. Burying-goriund, n.s. స్మశానభూమి, రుద్రభూమి. Bush, n.s. పొద. why do you beat about the * ముఖ్యమైన కార్యము చెప్పకుండా వూరికె యేల పెంచుతావు. Bush fighting దాగిచేసే యుద్దము. Bashel, n. s. తూము, ముప్పైరెండు శేర్లు పట్టే తూము. he hides his lamp under a * నిగురుగప్పిన నిప్పువలె వున్నాడు. Bushy, adj. పొదలుగల, దట్టమైన. * hair చింపిరి తల. * beard చంపిరి గడ్డము. the * tail of a fox నక్క యొక్క చింపిరి తోక. Busily, adv. పనిదొంతరగా, నిండా పనిగా, చురుకుగా. this squirrel was * eating the grain ఆ వుడత ధాన్యమును బహు చురుకుగా తింటూ వుండినది. he is * engaged వాడునిండా పనితొందరగా వున్నాడు. Business, n. s. పని, కార్యము, వ్వవహారము, ధర్మము, వ్యవసాయము, వర్తకము, వ్యాపారము, సంగతి, ప్రమేయము, విషయము. About this businhss యీ విషయమును గురించి. A man in * వ్యవహారములో వుండేవారు. they have left off * వాండ్లు వర్తకమును చాలించినారు. A man of * వ్యవహారస్తుడు. he is my man of * అతడు నా వ్యవహారమును చూచేవాడు. I will make it my * to do this దీన్ని నెరవేర్చడము నా పని. Is it not your * to support your mother? నీ తల్లిని కాపాడడము నీకు ధర్మము కాదా? they did his * వాడిపని కాజేసినారు, అనగా వాణ్ని చంపినారని అర్థము. Go about your * లేచిపో నీ పనికి నీవు పో. he went about his * వాడిపనికి వాడు పోయినాడు. Busk, n. s. బిగువుపడ్డ, అనగా జాతిస్త్రీలు బిగువుగా వుండడమునకై ముందరితట్టున్ను వెనకతట్టున్ను నడుముకు దోపి కట్టుకునే తిమిమత్స్యపు యెకముతో లేక వుక్కుతో చేసినబద్ద. Buskin, n. s. నాటకము ఆడే వేషగాండ్లు తొడుక్కునే ఒక తరహా బూట్సు. Buskined యీ బూట్సు వేసుకొన్న. Buss, n. s. (Shakespeare, adn Spenser, F. q. 3.10.46) a kiss ముద్దు, యిది నీచ శబ్దము. a boat for fishing * c. చేపలుపట్టే వాండ్ల పడవ. or Omnibus యిరువైమంది కూర్చుండ తగిలి కూలిబండి. To Buss, v. a. (Shakespeare, and Spenser) To Kiss ముద్దు బెట్టుట. Bust, n. s. అర్ధాకృతి ప్రతిమ, అనగా తల మొదలుకొని రొయ్యలమట్టుకు చేసిన రాతి ప్రతిమ. Bustard, n. s. ఒక తరహా అడవికోడి, దీన్ని బట్ట మేరపక్షి అంటారు. To Bustle, v. n. దడబిడలు చేసుట, గడివిడి చేసుట. Bustle, n .s. గలభ, అల్లరి, సందడి, దడబిడలు, గగిబిడి. or lady's plumper పిరుదు దిండు, పిరుదులు గొప్పగా అగుపడడమునకై స్త్రీలు పిరుదుకు కట్టుకొనే దిండు. Busy, adj. పనిగావుండే I am * just now నేను యిప్పుడు పనిగా వున్నాడు. he is a * fellow or impertenant వాడు అధిక ప్రసంగి. To Busy himself, v. n. పనిబడుట, పని పెట్టుకొనుట. he busied himself పనిబడ్డాడు. he stayed at home and busied himself in arranging his books వూరికె యింట్లో వుండినందున పుస్తకములు సవరించడమనే పని పెట్టుకొన్నాడు. Busy, n. s. అధిక ప్రసంగి, పరుల జోలికి పొయ్యేవాడు. But, conj. అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are * three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22. Butcher, n. s. కటికవాడు, కసాయివాడు. he is a prefect * i. e he is cruel పరమ ఛండాలుడు. Butcher's meat కసాయివాడు అమ్మే మాంసము. (యిందువల్ల పక్షులుగాని చేపలుగాని కాదని భావమౌతున్నది.) To Butcher, v. a. గొడ్డువలె చంపుట, పశుప్రాయముగా చంపుట, వధచేసుట. Butcher n. s. (the hargila or adjutant) బెగ్గురుకౌంగ అనేపక్షి. Butchered, adj. పశుప్రాయముగా చంపబడ్డ, వధచేయబడ్డ. Butchery, n. s. కటికతనము, వధ, హత్య, సంహారము. at night a dreadful * took place రాత్రి వక అఘోరమైన హత్య జరిగినది. or butcher's shop కసాయివాడి అంగడి. Butea, n. s. the name of a tree మోదుగచెట్టు, కింశుకము. (it has a bright scarlet flower). Butler, n. s. బొట్లర్లు, వుగ్రాణపువాడు, అన్నపానాదులు విచారించే పెద్దపనివాడు, సారాయి కొట్టుమీద వుండేవాడు. Butt, n. s. of a gun తుపాకి యొక్క కుందా. or mark గురి, లక్ష్యము. he is the * of misfortune ఆపదకు ఆలయమైనవాడు, పాత్రమైనవాడు, యిరవైనవాడు. he was made the * of ridicule or he was their * వాణ్ని యెగతాళి పట్టించినారు. of a spear కుప్ఫై. అనగా యీటె కర్రయొక్క అడుగుకుప్పె. the back end of a Beam పిరుదు, అనగా దూలముయొక్క వెనకటి మొన. or a cask నూరయిరవైయారు గాలములుపట్టే పీపాయి. or measure యెనిమిది మణుగులు, దీన్ని సాగరమంటారు. In tumbling down he coame full butt against me కాలుజారి నామీద వచ్చి పడిపోయినాడు. To Butt, v. a. కుమ్ముట, కొమ్ములతో పొడుచుట, ఢీకొట్టుట. the goat butted at me మేక కుమ్మవచ్చినది. the goat butted him into the ditch ఆ మేక వాణ్ని పొడిచి కాలవలో తోసినది. many roads * down upon this యీ బాటకు శానా దోవలో అడ్డమువస్తవి. Buttend, n. s. of a spear. యీటె యొక్క అడుగు కుప్పె. Butter, n. s. వెన్న. a pat of * వెన్న పూస. melted or clarified * (ghee) నెయ్యి, ఘృతము. or flattery బుజ్ఙగింపు, యిది క్షుద్రప్రయోగము. To Butter, v. a. వెన్న చరుముట. buttered bread వెన్న చరిమినరొట్టె. Butter, n. s. ఒక తరహా గిన్నె. Buttercup, n. s. ఒక తరహా పుష్పము. Butterfly, n. s. ఆకుచిలక, సీతాకోకచిలక. Buttermilk, n. s. మజ్జిగ. Butterpit, n. s. వెన్నపెట్టే ఒకతరహా గిన్నె. Butter-teeth, n. s. ముందుపండ్లు, మునిపండ్లు. Butterwoman, n. s. గొల్లది. Buttery, n. s. వుగ్రాణము, ఆహారములు పెట్టే వుగ్రాణము. Buttery, adj. greasy జిడ్డైన. Buttock, n. s. ముడ్డి, పిరుదు, పిర్ర. the buttocks నితంబము, శ్రోణి. Button, n. s. బొత్తాసు, గుండీ. or bud మొగ్గ. To Button, v. a. బొత్తాయి తగిలించుట, గుండి తగిలించుట. he buttoned his coat చొక్కాయ బౌత్తాసులను తగిలించుకొన్నాడు. unbuttoned బౌత్తాసులు తీసివేసిన, he unbuttoned his coat చొక్కాయ గుండీలను తీసివేసినాడు. Buttonhole, n. s. బౌత్తాసులు తగిలించే రంధ్రము. Buttress, n. s. అండగోడ, ముట్టుగోడ. Butyraceous, adj. ఘృతసంబంధమైన. Buxom, adj. ముద్దుగా వుండే, రసికత్వము గల . a * lass సొగసైన పడుచు. Buxomness, n. s. సరసత, రసికత, ఉల్లాసము. To Buy, v. a. కొనుట, తీసుట. I bought him off లంచమిచ్చి వాణ్ని తపించినాను. they bought over my withness నా సాక్షులను లంచి మిచ్చి లోపరుచుకొన్నారు. Buyer, n. s. కొనేవాడు. Buzz, n. s. ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెల ఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము. Report వదంతి. To Buzz, v. n. ఝంకారము చేసుట, ఝుంమనుట, దోమలు కూచుట. To Buzz, v. a. to spread వ్యాపించచేసుట, రట్టుచేసుట. రవ్వచేసుట. they buzzed this through the twon దీన్ని వూరంతా రట్టుచేసినారు, ప్రసిద్ధము చేసినారు; విత్తినారు. Buzzard, n. s. ఒకతరహా గూళి, యిది శవమునున్ను మలమునున్ను తినేటిది. a mean sort of hawk ఒక తరహా దిక్కుమాలిన డేగ. or a dunce మూఢుడు, జడుడు, శుంఠుడు. Buzzed abroad, adj. రట్టుచేయబడ్డ, రచ్చైన, వదంతిగావుండే, ప్రచురము చేయబడ్డ. Buzzing, n. s. ఝంకారము, ఝుం మనడము. By, prep. వల్ల, చేత, నుంచి, గుండా, ద్వారా, దగ్గెర, ఒద్ద, చొప్పున, ప్రకారము. It was five feet * three అది పొడుగు అయిదు అడుగులు వెడల్పు మూడు అడుగులు వుండెను. he multiplied the number by four ఆ సంఖ్యము నాలుగింట గుణించినాడు. * whom is this poem, * Valmike యీ కావ్యము యవరుచెప్పినది. వాల్మీకి చెప్పినది. Take warn * him వాడి గతి చూచి నీవు జాగ్రత్తగా వుండు. he was sitting * her దాని వద్ద కూర్చుండి నాడు. the money I have * me నా వద్ద వుండే రూకలు. I came * his house వాడి యింటి మీదుగా వస్తిని. he went * me నేను యిక్కడ వుండగా యిట్లా పోయినాడు. he was * birth a bramin వాడు జన్మతః బ్రాహ్మణుడు. he took me * the hand నా చెయ్యి పట్టుకౌన్నాడు. he pulled the cow * the tail ఆ యావును తోక పట్ఠి యీడ్చినాడు. he effected this * stratagem దీన్ని వుపాయము మీద సాధించినాడు. I effected this * means of my brother దీన్ని నాయన్న కుండా నెరవేర్చితిని. he entered * force బలాత్కారముగా చొరబడ్డాడు. * our law he must die మన చట్ట ప్రకారము వాడు చావవలసినది. I called him * name వాడి పేరుమట్టుకు నాకు తెలుసును. his brother * name Ramaya రామయ్య అనేపేరుగల వాడి అన్న. he sent the letter * post ఆ జాబును తపాలు మార్గముగా పంపినాడు. * what road will you go ? నీవు యేభాటన పోదువు. will you go * water or * land? నీళ్లమీద పోతావా లేక గట్టుమార్గాముగా పోతావా. the cloth dried * the heat యెండకు బట్ట ఆరినది. I came here * his desire అతని వుత్తర్వు ప్రకారము యిక్కడికి వస్తిని. she was with child * him అది అతనికి గర్భమైనది. I swear * thee నీయాన, నీతోడు. he swore * God he would do this దీన్ని చేస్తానని దేవుడి మీద వౌట్టు బెట్టు కౌన్నాడు. he cursed me * his gods నా దేవతలు నిన్ను చెరుపుదురుగాక అన్నాడు. (1 Sam. XVII.43.) It will be finished * (or before) the end of the month యీ నెలసరికి ముగుసును. * the time you arrive నీవు చేరేటప్పటికి. I made the box * the pattern ఆ పెట్టెను మాదిరి ప్రకారము చేసినాను he drank the water * measure వాడు నీళ్ళను కొలతగా తాగినాడు. he fell * the sword కత్తి నరుకుబడి చచ్చినాడు. he fell by me నా పక్కన పడ్డాడు. by writing to him వాడికి వ్రాసినందున. * day light పగలు. he entered * day light పగలు వచ్చినాడు. * design ప్రయత్న పూర్వకముగా he came * night రాత్రి వచ్చినాఢు. వచ్చి చేరినాడు. * night fall the people had all * arrived సాయంకాలానికి అందరు వచ్చి చేరినారు. they will have arrived * this or * this time వాండ్లు యీ వేళకు చేరివుందురు. * profession he is a carpenter వాడి వృత్తి వడ్డపని. * reason fo these debts యీ అప్పులవల్ల. * all means అన్ని విధాల, ముఖ్యముగా. * all the cirucumstaances అన్ని విధాల. day * day దినక్రమేణ, దినానికిదినము. he comes there day * day ప్రతిదినము అక్కడికి వస్తాడు. Two * two యిద్దరిద్దరుగా, రెండేసిగా. they arried one * one వాండ్లను ఒక రౌకరినిగా పోనియ్యి. little * little కొంచెము కొంచెముగా, step * step అడుగడుగున. step * step or * degrees he beacme a learned man వాడు క్రమేణ పండితుడైనాడు. month * month they receive their wages నెలనెలకు సంబళము తీసుకొంటారు. he wrote it down word * word మాటకుమాట వ్రాసుకౌన్నాడు. they were reckoned * thousands వేలతరబడిగా యెంచబడ్డవి. We must do as we would be done * ఒకరు మనకు చేయవలెనని యెట్లా కోరుతామో మన మున్ను ఒకరికి అట్లా చేయ వలసినది. * chace I saw him ఆకస్మిముగా అతన్ని చూస్తిని. he was * himslef వాడు వొంటిగా వుండెను. I came * myself నేను వొంటిగా వస్తిని. he is older than me * four years నాకంటే వాడు నాలుగేండ్లు పెద్ద. they are brothers and * consequence they must know each other వాండ్లు అన్న దమ్ములు అయినందువల్ల వకరిని వకరు యెరిగి వుండవలసినది. he got it * heart అది వాడికి కంఠపాఠముగా వచ్చును, ముఖస్థముగా వున్నది. * right he would be king న్యాయప్రకారము వాడు రాజుకావలెను. * turns మార్చి మార్చి. * my watch it is four నా గడియార ప్రకారము నాలుగు గంటలు. * this time twelve months యిది మొదలుకొని సంవత్సములోగా. at a house hard * నిండా సమీపముగా వుండే యింటిలో. thsi is harder * far దాని కంటే యిది నిండా ప్రయాస. I will stand * you నీకు నేను వున్నాను. By, adv. దగ్గెర, సమపాన, కడగా. were you * at the time? నీవు అప్పుడు వుంటివా. I was * నేను దగ్గెరవుంటిని. how did you come * this ? యిది నీకు యెట్లావచ్చినది. the time is gone * సమయము మించిపోయినది. to lay * దాచిపపెట్టుట, యెత్తిపెట్టుట. they set him * అతణ్ని వుపేక్ష జేసినారు. put it * దాచిపెట్టు. * and * కొంత శేపులో, కాస్తతాళి, తరువాత. By-blow, n. s. మరుగుదెబ్బ, దొంగదెబ్బ, అనగా దొంగతనముగా పుట్టినబిడ్డ; By-by, n. s. (bullaby) జోజో, చిచ్చీ, లాలి, అనే మాటలు. By-corner, n. s. ఒకమూల, దాగేస్థలము. Bye, adj. మరుగైన, by a * way మరుగుదారిన. by the * ఓహో నాకుజ్ఙాపకము వచ్చినది. Bye-ends, n. s. దొంగయుక్తి, స్వలాభము, స్వప్రయోజనము. By-gone, adj. గతించిన. In * times గతించిన కాలములో. By-lane, n. s. ఒక మూలవుండే సందు, గొంది. Bylaw, n. s. వారి వారిలో వుండే సంప్రదాయము, నిబంధన, ఆచారము, వాళి, సాంగ్యము, కట్టుబాటు. By-path, n. s. అడ్డదోవ, యెడదారి, దొంగదోవ. By-play, n. s. కపటము, కుత్సితము, కుయుక్తి. In this letter he made some * యీ జాబులో కొంత అన్యాప్రదేశముగా వ్రాసినాడు. By-road, n. s. అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ. By-room, n. s. మరుగుగా వుండే అర, దొంగ అర. By-stander, n. s. దగ్గెర వుండేవాడు, పక్కనవుండేవాడు, సాక్షి. or otheres పరులు, లోకులు, మధ్యస్థులు. By-street, n. s. ఒక గొందిలో వుండే వీధి. By-way, n. s. అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ. By-word, n. s. సామిత, పొడుపుడుమాట. Tippoo has become a * among Hindus for a tyrant హిందువులలో క్రూరుడు అనడమునకు టీపు అని పేరు పోయినది, అనగా వీడు రెండో టీపు అంటే క్రూరుడని భావము.