విక్షనరీ:మూలాలు
విక్షనరీలో పదాలలో చేరుస్తున్న వివరాలకు మూలాలు (రిఫరెన్సులు) ఎలా చేర్చాలో ఈ పేజీ వివరిస్తుంది.
మూలాలను ఎందుకు తెలుపాలి ?
[<small>మార్చు</small>]- చదివేవారు ఇక్కడ ఉన్న సమాచారము సరయినదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి ఉపయోగ పడుతుంది.
- విక్షనరీ యొక్క నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు.
- అక్కడ ఉన్న సమాచారం మీ సొంత అభిప్రాయం కాదు అని తెలుపటానికి. విక్షనరీ మీ పదాలలో మీ సొంత అభిప్రాయాలకు తావులేదు. అలాంటివి ఏమయినా ఉంటే గనక వాటిని చర్చా పేజీలలో ఉంచండి.
- ఇతర సభ్యులు మీరు రాసిన దానిని వ్యతిరేకించకుండా ఉండేందుకు కూడా మూలాలు అవసరం.
- మూలాలను తెలుపటం వలన అసలు సమాచారం అందించిన వారికి తగిన గుర్తింపు/ గౌరవం ఇచ్చినట్లుంటుంది.
గమనిక: సాధ్యమయినంత వరకు విక్షనరీలో ఉన్న ఇతర పదములను మూలాలలో చేర్చవద్దు. అలాంటి వాటిని "ఇవికూడా చూడండి" జాబితాలో ఉంచండి.
మూలాలను ఏ ఏ సమయాలలో తెలుపాలి
[<small>మార్చు</small>]పదములో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడు
[<small>మార్చు</small>]- మీరు ఏదయినా కొత్త సమాచారాన్ని సేకరించి, దానిని ఇక్కడ ఉన్న పదాలలో చేర్చాలనుకున్నప్పుడు, మొదట ఆ సమాచారం యొక్క మూలాన్ని తెలుపండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్‌సైటులోని పేజీ లాంటివి ఏదయినా కావచ్చు, కాకపోతే మీరు పొందుపరచిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా చదివేవారెవరయినా నిర్ధారించగలిగేటట్లు ఉండాలి. ఒక వేళ మీరు రాసే సమాచారం గురించి మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఎటువంటి మూలాలను చూడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ అలాంటి సమయాలలో ఇతరులకు మీరు రాసిన దానిపై సందేహాలుంటే వాటిని తీర్చటానికి కావలిసిన మూలాలను చేర్చండి, అప్పుడు ప్రతీ ఒక్కరి సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉండదు.
- మూలాల యొక్క అసలు అవసరం, ఏదయినా విషయంపై అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు ఉంటుంది. అలా అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు, దానిని ధృవపరచటానికి సరయిన మూలం చూపించారంటే, ఇంక అందరూ మీ వాదననే ఒప్పుకుంటారు (దానికి వ్యతిరేకంగా ఇంకో మంచి మూలం చూపించే దాకా). "కొంతమంది ఇలా భావిస్తారు", "కొంతమంది అలా భావిస్తారు", లాంటి వాక్య నిర్మాణాలను సాధ్యమయినంతవరకు తగ్గించండి. సాధారణంగా అలాంటి వాక్యాలు, చదివేవారి మదిలో వ్యతిరేక ప్రభావం చూపుతాయి.
- విక్షనరీ మీ అభిప్రాయాలను తెలుపటానికి ఒక వేదిక కాదు.
- ఇది తెలుగు భాషలో ఉన్న విక్షనరీ కాబట్టి మీ మూలాలను సాధ్యమయినంత వరకూ తెలుగులో ఉండేటట్లు చూడండి. ఒక వేళ తెలుగులో సరయిన మూలాలు దొరకకపోతే, అప్పుడు ఆంగ్లంలో ఉండే మూలాలను సూచించండి.
పదాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించినప్పుడు
[<small>మార్చు</small>]* మీరు చేర్చని విషయాలకు కూడా మీకు తెలిసిన మూలాలు ఏమయినా ఉంటే వాటిని కూడా చేర్చవచ్చు. చేర్చేముందు ఒకసారి పరిశీలించి చేర్చండి. అంతే కాదు పదానికి మూలాలను చేర్చడం విక్షనరీలో చాలా గొప్ప కృషిగా భావిస్తారు. వాక్యాలకు పక్కనే మూలాలకు సంబందించిన లింకులు గానీ సమాచారం కానీ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే, వాటిని మీరు రాస్తున్న వాక్యాల పక్కనే ఉంచటం మంచిది.
పదానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నప్పుడు
[<small>మార్చు</small>]- గొడవకు కారణమయిన పద భాగాన్ని వెంటనే చర్చా పేజీకి తరలించండి. ఒకవేళ ఆ పద భాగం అంత కీడు తలపెట్టేది కాదు అని అనుకున్నప్పుడు, లేదా దానికి సంబంధించిన మూలాన్ని చేరిస్తే సరిపోతుంది అని భావించినప్పుడు {{మూలాలు అవసరం}} అనే మూసను ఆ వ్యాస భాగం తరువాత ఉంచండి. {{ మూలాలు సమీక్షించండి}} అనే మూస కొన్ని సందర్భాలలో మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
పదానికి సంబందించి గొడవ జరుగుతుందని అనుకున్నప్పుడు
[<small>మార్చు</small>]- ముందుగానే ఊహించండి: మీరు చేర్చిన విషయం మీద ఎవరికయినా సందేహం కలుగవచ్చేమో అనే విషయాన్ని ఆలోచించండి. విక్షనరీలో మీరు చేర్చిన సమాచారానికి ఊతంగా ఏదయినా మంచి మూలాన్ని చేర్చినట్లయితే అప్పుడు ఇతర సభ్యులు ఆ సమాచారాన్ని తొలగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
సమాచారం ఎక్కడ లభించిందో తెలుపండి
[<small>మార్చు</small>]- మూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు.., అసలు సమాచారం ఇంకో దగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్‌సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే, దానిని విక్షనరీ మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యవర్తి అయిన వెబ్‌సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:
- <ఫలానా వెబ్‌పేజీ>, <ఫలానా పుస్తకం నుండి> ఈ సమాచారాన్ని సేకరించింది, లేదా
- <ఫలానా పుస్తకం>, <ఫలానా వెబ్‌పేజీ> లో మూలంగా తీసుకున్నప్పుడు సమాచారం తెలిసింది.
మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసిన తరువాత మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్‌పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:
- <ఫలానా పుస్తకం> (<ఫలానా వెబ్‌పేజి> కూడా చూడండి).
దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్ణించేసుకోవడానికి.
మూలాలను పదాలలో చేర్చే విధానం
[<small>మార్చు</small>]- విక్షనరీలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న పదము భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినా కూడా పదాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే పదంలో మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధానమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
విధానం ఒకటి
[<small>మార్చు</small>]- ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న పదములో ఈ క్రింది విధముగా చేర్చాలి.
<ref name="మూలం పేరు"> ఒకటో రచయిత, రెండో రచయిత, (2001)లో రాసిన ఫలానా పుస్తకంలోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: అఆఇఈ ప్రచురణలు </ref>
ఇలా మీరు చేరుస్తున్న సమాచారానికి రుజువులుగా, సమాచారంతోనే చేర్చేయండి. ఆ తరువాత మూలాలు లేదా రిఫరెంసులు విభాగంలో <references />
అనే దానిని తగిలిస్తే సరిపోతుంది.
- ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా విక్షనరీ మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.