వృక్షప్రకంపనన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకడు చెట్టెక్కినాడు. కింద వున్న వాళ్లలో ఒక్కొక్కడు ఒక్కొక్క కొమ్మను చూపించి దాన్ని కదలించుమని అడుగా చెట్టుమీది వ్యక్తి మొత్తం చెట్టునే కదలించి అందరిని సంతృప్తి పరిచినాడు. [ఒక్క ప్రయత్నంతో చాలామందిని సంతృప్తిపరచడమని భావం.]

వివరణ
మొదలటు నిటు నూచిన చెట్టంతయు కదలినట్లు. కొందఱు చెట్టుక్రింద నిలబడి తమలో నొకనిని చెట్టెక్కు మనిరి. వాఁడట్లే సేసెను. ఒక డొకకొమ్మ కదల్చుమనెను. మఱొకఁడింకొకకొమ్మను; తదితరుడు తదితరశాఖను; అన్యు డన్య విటపమును గదల్చుమనిరి. వాడ ట్లే వరుసన అన్నికొమ్మలను గదల్చుచు వచ్చెను. ఏకొమ్మ కదల్చిన నదియే కదలెడిదికాని చెట్టంతయు నొకమాఱుగ కదలలేదు. మొదట తా మనుకొనినట్లు చెట్టంతయు నొకమాట కదలింప జాలక వారు తమలోదాము కళవళపడుచుండిరి. త్రోవన బోవుచున్న తెరువరి యొక డదంతయు నెఱిఁగి చెట్టుపైనున్న వానిని దిగిరమ్మనెను. పిదప నందఱుఁగలసి చెట్టుమ్రాను నటునిటు శక్తికొలది ఊపుడనెను. వారట్లే చేసిరి. చెట్టంతయు నొకమాఱుగ గదలిపోయెను. అట్లే- ఈశ్వరతేజోంశభవులవు నాయామూర్తుల నాయామంత్రములతో నాయాశాఖలవారు వేఱువేఱు తీరుల గొలుచుచుందురు. వారిధ్యానమున తన్మంత్రాధినేతయవు నామూర్తియే సంతసించునుగాని సర్వమయమవు నద్వితీయ పరబ్రహ్మము ప్రసన్నము కాఁబోదు. సర్వమూలమవు ఆపరతత్త్వమును ధ్యానించునెడల విరాట్పురుషు ననుగ్రహమును, సర్వదేవతో పాసనాఫలితమును పొందనవును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]