వృద్ధకుమారీవరన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వృద్ధకుమారీవరన్యాయము అనాగా ఒకవృద్ధుడు కన్య వరములు కోరుకొనినట్లు. ఒక యూరిలో నొక వృద్ధబ్రాహ్మణు డుండెను. అతఁడు గ్రుడ్డివాడు, దరిద్రుఁడు, అవివాహితుఁడు. అతడష్టకష్టములు ననుభవించుచు విసివి అడవికి పోయి తపస్సు చేసెను. పరమేశ్వరుఁడు మెచ్చి ప్రత్యక్షమై వర మడుగుమన నావిప్రుఁడు విప్రుల కొకటికంటెఁ నెక్కువగ వరము లడుగుట కధికారము లేనందున నొకేవరముతో తనయన్ని కష్టములు తీరునట్లును, లేనిని ప్రాప్తించునట్లును వరమును పొంద నిశ్చయించి "దేవా నామనుమడు రాజసింహాసనమున నధివసింపఁగాఁ జూచికొను భాగ్యమును దయసేయుము" అని కోరెను. దానితో తనవార్ధక్యము, దారిద్ర్యము పోవుటయు, తాను యువకుడై వివాహము చేసికొనుటయు, సంతానప్రాప్తియు, మహైశ్వర్యము, దీర్ఘాయువు లభించవలయునని ఆతని యాశయము. అట్లే- ఒకకన్యక ఎన్ని సంవత్సరములు గడచినను వరుఁడు దొఱకక అవివాహితయై యున్నందుల కెంతయుఁ జింతిలి యొకనా డేకతమ అడవికి పోయి తపస్సు చేసి దేవుని మెప్పించెను. భగవానుఁడు దర్శన మిచ్చి యభీష్ట మిత్తు కోరుకొనుమనెను. ఆమె చాలదీర్ఘముగ నాలోచించి బహులాభప్రాప్తిఁగోరి "నాపుత్త్రులు బంగారుపళ్ళెరములో ఇష్టమృష్టాన్నము లారగించుచుండ జూచి యానందించునట్లు వరమి" మ్మనెను. భగవానుఁడ వల్లెయనెను. తన వివాహము, అందును తనభర్తకు రాజైశ్వర్యము, సంతాన ప్రాప్తి, పరమాయువు మున్నగు బహులాభములు ఒకే వరముచే నామె సంపాదించుకొన దలఁచి యిట్టి వరము వేఁడి కృతార్థురా లయ్యెను. కావున- ఒకేవాక్యముచే ననేకాశయములు స్ఫురించు తావుల నీన్యాయము ప్రవర్తించును. దీనికి వృద్ధకుమారీన్యాయము, వృద్ధకుమారీవాక్య న్యాయము, వృద్ధకన్యావరన్యాయము అనియు పేర్లతో ఇది కలదు..

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]