వెన్నెలరాత్రి

విక్షనరీ నుండి

శరదృతువులో ఆకాశం స్పష్టంగా వుండి, తెల్లటి వెన్నెల కాస్తూవుంది . అసలే తెల్లని మబ్బులు. వాటి చాటున ఉన్న శశిబింబం చిందిస్తున్న వెన్నెల కాంతిలో అవి తళతళా మెరిసిపోతున్నాయి. శరత్కాల వెన్నెల గురించి శ్రీ కృష్ణ దేవరాయల వారు ఆముక్తమాల్యద లో చెప్పినట్లు :" రాత్రివేళల శరజ్జ్యోత్స్న చాలా దట్టంగా కాస్తోంది. ఆ చిక్కదనం వెన్నెలకెలా వచ్చింది? అంటే, ఉదయమంతా యెండ తాకిడికి భూమి అనే పెనం వేడెక్కిందిట. అలాంటి వేడి పెనం మీద అట్లపిండిలాంటి వెన్నెల పడి, అది దిబ్బరొట్టెలాగా దళసరిగా అయ్యిందట! ఇలాంటి వర్ణనల్ని చదివినప్పుడు, "ఓరినీ అసాధ్యం కూలా!" అని నోరు వెళ్ళబెట్టడం తప్ప ఏంచేస్తాం! వెన్నెల "పిండారబోసినట్లు" కాసిందని అంటాం కదా. ఆ పిండిని నిజంగానే పొయ్యాల్సిన పెనం మీద పోసారు రాయలవారు". ఆ రోజుల్లో... ఆరుబయట మంచాలేసుకుని పడుకుంటే హాయిగా ఉండేది. ఆ వెన్నెల చల్లదనం అనుభవించిన తృప్తి ,ఆనందం ఇంకా నా అనుభవంలోనే వుంది నాకేంటి! నా తరం వారందరికీ ఖచ్చితంగా ఉంటుంది.. ఆ వెన్నెల అనుభూతి.