Jump to content

వేపుడు చనగ పప్పు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
వేపుడు చనగ పప్పు
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

వేపు అనే క్రియాపదము చనగ, పప్పు అనే రెండు నామవాచకమ పదాలు మొత్తం మూడు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వేపుడు చనగ పప్పు అంటే చనగలను వేగించి పొట్టు తీసి తయారు చేసిన పప్పు. వీటిని దక్షిభారతంలో చట్నీ తయారు చేయడానికి ఉపయోయిస్తారు. భోజనశాలలలో గృహములలో చెనగపప్పు చట్నీకి ప్రత్యేకత ఉంది. వేపుడు చనగ పప్పును పొడి చేసి ఉప్పు కారముతో చేర్చి అన్నములోకి ఆధరువుగా వాడుతుంటారు. ఆవకాయలాంటి ఊరగాయలు, చింతకాయ పచ్చడి మొదలైన వాటితో చేర్చి అన్నంలో కలుపుకుని తినడం తెలుగు వారి ప్రత్యేకత. వీటిని చక్కెర, కొబ్బరి తురుము, యాలుకలు లాంటివి చేర్చి చిమ్మిరి చేసి వట్టిగా తింటారు. ఈ చిమ్మిరితో కజ్జికాయలు తయారు చేస్తారు. చనగ పప్పును బెల్లం పాకంలో వేసి ముద్దలు తయారు చేసి శ్రీమంతానికి సారెలో పెట్టడం ఆంధ్రుల ఆనవాయితీ. వేపుడు చనగ పప్పు పిండిని బెల్లం పాకంలో చేర్చి బర్ఫీ తయారు చేస్తారు. వీటిని పప్పు చెక్కలు అంటారు. ఒకప్పుడు ఇవి చిన్న చిన్న బంకులలో లభించేవి.

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]