శతపత్రపత్రశతభేదనన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నూఱు దలములు గల తామరపూవును ముద్దగ పట్టుకొని సూదితో గ్రుచ్చినదో నూరురేకులు చిల్లులు పడును. విప్పిచూచిన నవి అన్నియు నొకేమాఱుగ చిల్లు వడినట్లు తోచును. కాని కాలభేదము కలదు. ఒక రేకులో నుండి, రెండువదానికిని, అందుండి మూఁడవదానికిని, నాలవుదానికిని సూది క్రమక్రమముగ దిగి చిల్లు చేయవలయునుగదా. అట్లు ఒక దానినుండి రెండవుదానికిం బోవు నపుడు సూది కొంత కాలము తీసికొనును. కాని అతిసూక్ష్మ మవుట నయ్యది మనకు గుర్తింప సాధ్యము కాక ఒకేమాఱుగ నవన్నియు చిల్లుపడ జేయ బడినవని భ్రమింతుము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు