Jump to content

షష్ఠాద్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆఱుగురిలో మొదటివాడు అన్నట్లు. ఒకచోట ఆఱుగురు మనుష్యులున్న వారిలో మొదటివాడెవడో తెలిసికొనుట దుర్ఘటము. వారిలో నెవనినుండి లెక్కించుట ప్రారంభించిన నాతడే మొదటివాడవును. అదేలెక్కయందు అనులోమవిలోమముగ మొదటివా డాఱవవాఁడును, ఆఱవవాఁడు మొదటివాఁడును కావచ్చును. కాని అభిమతుడుమాత్రము తెలియ బడఁడు. అట్లు మొదటివాడు తేలవలెననిన ఫలానా ఫలానా ఆఱుగురిలో మొదటివాఁడు అని నిర్ధారణచేసి చెప్పవలెను. అనిర్ధారిత విషయములం దీన్యాయము ప్రవర్తించును. ఆచెట్టుమీది పక్షులలో మొదటిది చాలా అందమైనది అన్నట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]