సత్తావాస

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జీవుల ఆవాసాలు అని నైఘంటుకార్థం. జీవులు అంటే మనుషులూ, జంతువులూ, క్రిమికీటకాదులే కానవసరం లేదు. దివ్య లోకాలలోని వారు కూడా కావచ్చునని బౌద్ధ సూత్రాలు (దీఘ నికాయ) తెలియజేస్తున్నాయి. ఈ ఆవాసాలు తొమ్మిది విధాలు. 1. శరీరాలు వేరుగా ఉండి, ఇంద్రియజ్ఞానం/ గ్రహణ శక్తి కూడా వేర్వేరుగా ఉండే జీవులు. మానవులూ, దివ్యలోకాలలోని కొందరూ, దుర్గతి చెందిన (వినిపాతిక) మరి కొంతమందీ ఈ తరగతికిచెందిన వారు. 2. శరీరాలు భిన్నంగా ఉంటాయి గానీ, గ్రహణ శక్తి/ ప్రత్యక్ష జ్ఞానం ఒకే విధంగా ఉండే వర్గం. ఉదాహరణకు సృష్టి ఆరంభంలో బ్రహ్మలోక వాసులు. 3. శరీరాలు సమంగా ఉంటాయి. కాని, దృక్పథాలు వేరుగా ఉంటాయి. దివ్యులు (ఆభస్సర) ఈ తరగతికి చెందినవారు. 4. శరీరంలోనూ, చూసే దృష్టిలోనూ సమానులైన జీవులను సర్వప్రకాశ శక్తి కలిగిన ‘‘సుభ కిణ్హ’’ తరగతి అన్నారు. 5. కష్టం కలిగినప్పుడు అది కష్టమనీ, సుఖం కలిగినప్పుడు అది సుఖమనీ తెలుసుకొనలేని అచేతన జీవులు కొన్ని ఉంటాయి. (అసఞ్ఞ సత్త) 6. సాధనలో ఏ విధమైన అనుభూతికైనా అతీతంగా, చలించని స్థితిని పొందిన ఒక వర్గం వారు ఉంటారు. అలాంటివారు అవధులు లేని వియ న్మండలంలో తిరిగి జన్మిస్తారు. 7. అవధులు లేని వియన్మండలానికీ, ఆలోచనకూ అతీతమైన స్థితిని చేరినవారు నిరవధిక చేతనా లోకంలో తిరిగి జన్మిస్తారు. 8. నిరవధిక చేతనను చేరి అక్కడ అంతా శూన్యమే అన్నవారు శూన్య మండలంలో తిరిగి జన్మిస్తారు. 9. శూన్య మండలాన్ని దాటినవారు అనుభూతికి అతీతమైన స్థితిని చేరుకొంటారు. శుద్ధ ఆవాసాలలోని వారి ప్రస్తావన ఇక్కడ లేదు. ఎందువల్లనంటే బుద్ధులు జన్మించిన యుగాలలో మాత్రమే వారు అక్కడ ఉంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సత్తావాస&oldid=841724" నుండి వెలికితీశారు