సాకమేధీయన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నాలుగేసిమాసముల కొకసారిగ సంవత్సరమునకు మూఁడు మాఱులు- వసంతర్తువున, వర్షర్తువున, హేమంతర్తువున- జేయవలసిన యాగములు కొన్ని గలవు. వానిలో అంతర్భాగములుగ మఱికొన్ని యాగములు గలవు. వానికి సాకమేధులు అని పేరు. అవి మొత్తము ఏడుభాగములు. వానిలో మూఁడు మొదటి రోజునను తక్కిన నాలుగు భాగములు రెండవరోజునను చేసి మొత్తము కలాప మంతయు రెండు రోజులలో పూర్తిచేయవలెను. కాని, కొందఱు ప్రతియొకభాగము రెండురోజులవంతున మొత్తము కలాపమంతయు రెండురోజులవంతున మొత్తము కలాపమంతయు పదునాలుగురోజులలో ముగించవలె నందురు. కాని, విధిజ్ఞులు రెండవపక్షమును త్రోసివేసి మొదటిపక్షమునే నిర్ణయించి యుంచిరి. అట్లే- ఇన్ని రోజులు; కాదు ఇన్ని రోజులు అని రోజులతో సంబంధించిన వాదోపవాదములయం దీన్యాయము ప్రవర్తించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]