Jump to content

సింహస్యైకపదన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సింహముయొక్క మొదటియడుగు వడువున. తన శత్రువుపైకి పోవునపుడుగాని, మఱొకపుడుగాని సింహము మొట్టమొదటియడుగు మహాఠీవితో, మహా సాహసముతో వైచును. తరువాత నేమైన గానిండు. అట్లే- మొట్టమొదటి ప్రయత్నం మతిసాహస శౌర్య ధైర్యాదులతో నొప్పునప్పు డీన్యాయ ముపయోగింపఁ బడును. ఎట్లన- 'విచార్యావిచార్య వా, కృతప్రయాణోఽయం మహానరేంద్ర శ్చాలితః| సింహస్యైకపదం యథేతి న్యాయాచ్చలిత ఏవ రాజతే|" విచారించియో, విచారించకయో మంత్రిముఖ్యులచేఁ బ్రేరేపింపఁబడి యుద్ధసన్నద్ధుఁడై బయలుదేరిన రాజు సింహ స్యైకపదన్యాయమున మొట్టమొదటియడుగు వైచెను. ఆరంభశూరత్వమునుగూడ నీన్యాయము సూచించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]