సూచీకటాహన్యాయము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకడొక కమ్మరివానికి సూదియొకటియు, కాగొకటియు తయారుచేసి యిమ్మని చెప్పెను. వాడు ముందు సూది తయారుచేసి యిచ్చెను. కాగేది అనగా రెంటిలో నొకటి ముట్టినదిగదా; యిక కాగుప్రయత్నము చేసెదనని చెప్పెను. లోకములో రెండుపనులు- ఒకటి తేలికగ కొలదికాలములో జేయవీలవునదియు; మఱొకటి కష్టసాధ్యము, బహుకాలము పట్టునదియు- వచ్చినపుడు మొట్టమొదట సులభమైనదానిని మొదలిడి పూర్తిగావించి ఆపిదప రెండవదాని కుపక్రమింతురు. పరీక్షలో బాలురు ఎక్కువ ఆలోచింప నవసరము లేక తేలికగ వ్రాయగల ప్రశ్నలకు ముందు సమాధానము వ్రాసి, ఆపిదప ఆలోచింపవలసి ఎక్కువవేళ తీసుకొను ప్రశ్నలకు సమాధానములు వ్రాయునట్లు. అట్లే-వైదికసంప్రదాయమునగూడ-"అనుభవోపి ద్వివిధః| ప్రమాఽప్రమాచ| అప్రమాపి సంశయో విపర్యయశ్చ| ప్రమాచ ప్రత్యక్ష మనుమతిశ్చ||", "ప్రమానిరూప్యత్వా త్పరస్తా ద్విభక్తామ ప్యప్రమాం సూచీకటాహన్యాయేన ప్రాగ్విభజతేఽప్రమాపీతి."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు