address

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  1. విలాసము.
  2. చిరునామా.
  • నామవాచకం, s, a petition మనివి, అర్జి.
  • or speech ప్రసంగము, సంభాషణ.
  • direction పై విలాసము.
  • title వక్కణ, బిరుదావళి.
  • skill నిపుణత.
  • Mode of behaviour మర్యాద, రసము.
  • a man of good address సరసముగా, లేక, ఘనముగామాట్లాడేవాడు.
  • a man of mean address జబ్బురసముగా మాట్లాడేవాడు.
  • he paid his addresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.
  • క్రియ, విశేషణం, to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట.
  • I addressed my remarks to my brother, but I took care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ.
  • they utter abuse without addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు.
  • he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు.
  • Men address their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు.
  • To whom did he address the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు.
  • he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు.
  • the beggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు.
  • the priest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు.
  • She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు.
  • To whom did she address her song యెవరు వినవలెనని పాడింది.
  • he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు.
  • I addressed myself to him and asked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను.
  • they addressed themselves to cross the river యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి.
  • Being engaged he did not address me ; or he did not address himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు.
  • this book is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.
  • All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=address&oldid=922522" నుండి వెలికితీశారు