deny

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట.

  • he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.
  • I hope you will not deny me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను.
  • he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు.
  • he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు.
  • his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.
  • he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు.
  • he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.
  • he denied his child తన బిడ్డను త్యజించినాడు.
  • he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు.
  • I deny that అదికాదు, అట్లాలేదు.
  • he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.
  • నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు.
  • he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.
  • he says that they are brothers ! this I deny ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను.
  • he says the thieves are there :this she denies ఆ దొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది.
  • they denied the marriage ఆ పెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు.
  • he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు.
  • he would not deny his appetite వాడు కడుపుకట్టడు.
  • he denied his religion స్వమత ద్రోహియైనాడు.
  • he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు.
  • they deny havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు.
  • they deny that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు.
  • he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు.
  • to deny himselfor to deny his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.
  • a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు.
  • he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.
  • he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు.
  • One who denies hisGod దేవద్రోహి.
  • One who denies his father పితృద్రోహి.
  • God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deny&oldid=928537" నుండి వెలికితీశారు