expect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.
- I expect him అతడు వస్తాడని యెదురు చూస్తాను.
- he expected death చస్తాననుకొన్నాడు.
- Government expects your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు.
- I expect a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది.
- they expect you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.
- I expect you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను.
- If aman marries, he expects children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు.
- I expect I shall find him there బహుశా వాడు అక్కడ వుండును.
- I expect my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా.
- I expect you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట.
- She expects to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది.
- she, as I expected, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).