for
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
సముచ్చయం, యెందుకంటే, యేలనంటే, యేలాగంటే.
- for I called him వాన్ని పిలిచినానుగనక.
- Gesenius in his Hebrew lexicon observes ( on the word -ki-ki-for)It is often used at the begining of a proposition where it may be omittedintranslating: like (the German ja!) yea! Zech III 8-2 sam.
- XIX. 23.so before the direct address.
- like the Greek Ruth, I.10.Josh.11.24.1 Sam.X.19.and after oaths.1 sam XVI.
16.XIV 44; XXV.34.2.chr.XVIII.13.
- alsoat the beginning of the apodpsis or turn of the sentence "so then" Gen. XXII. 17. XXXI. 42. Numb. XXII. 33. Job.VIII. 6.XXXVII.20.
- On the rap schleusnerin his greek lexicon makes a similar remark that some times particularlyin the beginning of a sentence it is redundant " He instances Matt I.18. 2. Tim. II. 7. Galat. I. 10.
- Jones.(Gr, Eng.Dict. 1825.
- says on yap )For becausewherefore In fact Jesus himself bore testimony " Luke XII. 58.
- while you are indeed going with your adversary to the judge Rom IX.
15.
- in fact Moses he says : to Moses indeed he says Rom VII.2.
- the wife is in fact is indeed or assuredly bound &c.Rom IV.13.
- In fact the promise was made to Abraham Matt XXVII.23.
- And what evil in facthath he done " Jones gives further instances and rules : but in Telugu this word being an expletive may in some places be omitted and else where will be easily rendered by గదా.
- or else by సుమీ.
- or (colloquially లే.) or లెండి from లేచుట.
విభక్తి ప్రత్యయం, కై, కొరకు, కోసరము, గురించి, కి, కు.
- his reason యీ హేతువుచేతయీ హేతువును పట్టి.
- they sent for him వాణ్ని రమ్మని చెప్పి పంపించినారు.
- వాన్ని పిలిపించినారు.
- through his love for me he did this నా యందలివిశ్వాసముచేత దాన్ని చేసినాడు.
- through affection for her దానియందు వుండేవిశ్వాసముచేతను.
- they appeared for him వాడికి గాను వాండ్లు హాజరైనారు.
- he appeared for the defendant ప్రతివాదికై హాజరైనాడు, ప్రతివాదిపక్షముగావచ్చినాడు.
- give me that for this దీనికి బదులుగా దాన్ని యియ్యి.
- for all I could say he persisted నేను యెన్ని చెప్పినా వినకపోయినాడు.
- I came for it అందుకోసరము వస్తిని, అదికావలసివస్తిని.
- I want it for my brother అది నా తమ్ముడికొరకు నాకు కావలెను.
- it is hard for me to effect this యిది నన్నుంచి కాదు.
- I took him forhis brother వాన్ని చూచి వాడి అన్న అనుకొన్నాను.
- we fly for aid to thy footstool మీ పాదముల శరణుజొచ్చినాము.
- an order was issuedfor him to file his account లెక్కలు దాఖలు చేయమని వాడికివుత్తరువు అయినది.
- an order was issued for him to be imprisoned వాన్ని కావలిలో పెట్టమని వుత్తరువు అయినది.
- the wind blew so strong that it was not deemed advisable for the boats of the flect to join in the attack గాలి మహావడిగా కొట్టినందున పడవలలో వుండినసిపాయీలు ఆ యుద్ధములో కలిసేటందుకు యుక్తము కాదని తోచినది.
- what are you for ? నీకేమి కావలెను.
- I cannot go for the rain వర్షము వల్ల నేను పోలేను.
- I cannot see that house for the trees చెట్లవల్ల నాకు ఆ యిల్లు అగుపడలేదు.
- as for your brother he will not come నీ తమ్ముడైతే రాడు.
- as for the horse it is dead గుర్రమైతే చచ్చినది.
- do you know this for certain?యిది నీకు రూఢిగా తెలుసునా.
- he gives this out for fact యిది రూఢియైనట్టుఅంటాడు.
- he left the forest for the town వూరికి పోవడానికై అడివినివిడిచి బయల్దేరినాడు.
- where you for ? యెక్కడికి పోతారు.
- we are for Benares కాశికి.
- for learning he is certainly superior to them విద్యావిషయమందువాండ్లకు వీడు అధికుడే.
- for some days కొన్ని దినాలకు,కొన్ని దినములవరకు.
- he cannot come for three days మూణ్నాళ్లదాకా రాడు.
- for the last two months we had no rain పోయిన రెండు నెలలనుంచి వాన లేదు.
- I have been in this house for these two years యీ రెండు యేండ్లుగా యీ యింట్లో వున్నాను.
- he was imprioned for a week వారం దినములు ఖైదులో వుండినాడు.
- forever సదా, విడకుండా.
- he reads for ever యే వేళా చదువుతున్నాడు.
- the just live forever పుణ్యవంతులు, చిరంజీవులుగా వుంటారు.
- for want of money he did not buy it రూకలు లేనందున కొనలేదు.
- for fear of their detecting him వాండ్లు కనుక్కోబోతారని.
- for fear of the doghe would not go into the room కుక్కయొక్క భయముచేత వాడు ఆ యింట్లోకి పోలేదు.
- for fear he cannot speak భయముచేతమాట్లాడలేదు.
- word for word మాటకు మాట.
- It is not for you to say soయిట్లాచెప్పడము నీకు ధర్మము కాదు, యిది నీవు అనవలసినది కాదు.
- he builta boat for himself తన చేతులార తనకు వొక పడవ చేయించినాడు.
- he is all for himself తన మట్టుకు సుఖముగా వుంటే వాడికి యెవరుయెట్లాబోయినా అక్కరలేదు, వాడికి స్వసుఖమే ముఖ్యము.
- they left himfor dead వాడు చచ్చినాడనుకొని విడిచిపెట్టిపోయినారు.
- for shame ! ఛ , ఛీపో,పాపము.
- for shame you must not say so ఛీ నీవు అట్లా అనరాదు.
- forshame dont beat the child పాపము ఆ బిడ్డను కొట్టక.
- for want of a horse he came on foot గుర్రము లేనందున నడిచివచ్చినాడు.
- he beat me for nothingనన్ను నిష్కారణముగా కొట్టినాడు.
- he sold it for nothing దాన్ని వూరికేయిచ్చివేసినాడు.
- for my part I shall not go నేనైతే పోను.
- I for a foolor as a fool believed him నేను పిచ్చివాడనై వాడు చెప్పినదాన్ని నమ్మినాను.
- for anything I know he is dead నేను యెరగను గాని వొకవేళచచ్చినాడేమో.
- I cannot tell for my life what you mean నీ భావమేమోనాకు చచ్చినా తెలియదు.
- for all he was a bramin వాడు బ్రాహ్మణుడుగావుండిన్ని,వాడు యెంత బ్రాహ్మణుడైనా.
- she cannot speak for joyసంతోషమువల్ల అది మాట్లాడలేకపోయినది.
- the hire for washing the clothes గుడ్డలు వుతకడానికి కూలి.
- I am sorry for your loosing that money నీకు ఆ రూకలుపోయిన దాన్ని గురించి నాకు వ్యసనముగావున్నది.
- I did it for the sake of his brother వాడి అన్నను చూచిదాన్ని చేసినాను.
- as much as గనుక.
- for as much as he was born there అక్కడ పుట్టినాడు గనుక.
- as much as it is necessary to do thisయిదిచేయవలసినది అగత్యము గనక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).