have
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, కలిగివుండుట.
- this is generally expressed by వుండుట.
- to be, governed by a dative : thus, He has two sons వాడికి యిద్దరుకొడుకులున్నారు.
- one who has two sons యిద్దరు కొడుకులు గలవాడు.
- I have it అదినాకు వున్నది, నాకు చిక్కినది, నా వద్ద వున్నది.
- I have it not నా వద్ద లేదు.
- I have occasion to go there నాకు అక్కడికి పోవలసి వున్నది.
- I have some business with you నీతో నాకు కొంచెము పని వున్నది.
- he has sense వాడికి తెలివి వున్నది.
- he has no sense వాడికి తెలివి లేదు.
- I have no servant here యిక్కడ నాకు పనివాడు లేడు.
- I have no leisure to go పోవడానకు నాకు సావుకాశము లేదు.
- I have it by me అది నా వద్ద వున్నది.
- a man likely to have that book ఆ పుస్తకము వుండ తగినవాడు, ఆ పుస్తకమును కలిగివుండవలసినవాడు.
- he had tears in his eyes కండ్ల నీళ్లు పెట్టుకొన్నాడు.
- he has a fever వాడికి జ్వరము తగిలినది.
- she has a child దానికి వొక బిడ్డ వున్నది.
- she has had a child but it is dead అది బిడ్డను కన్నది అయితే ఆ బిడ్డ పోయినది.
- she had a child four months ago నాలుగు నెలల కిందట అది బిడ్డను కన్నది.
- In God we live and move and have our being మనము జీవించడము, మెలగడము, వుండడము దేవుని యందు.
- he who has nothing shall receive nothing వకటీ లేని వానికి వకటిన్నీ దొరకదు.
- I will not have this యిది నాకు వద్దు.
- will you have this ? యిది నీకు కావలెనా.
- Brick is to be had here యిటికలు యిక్కడ దొరుకుతవి.
- they will have his life వాడి ప్రాణమును పుచ్చుకొంటారు.
- we had a wet night రాత్రి వాన కురిసినది.
- you may have the house for 100 rupees నీవు ఆ యిల్లు నూరు రూపాయీలకు కొనవచ్చును.
- I had this money from him అతని వద్ద నుంచి యీ రూకలను తెచ్చుకొన్నాను.
- I had a letter from her దాని వద్ద నుంచి జాబు వచ్చినది.
- have you had your dinner ? భోజనము చేసినావా.
- what would you have ? నీవు కోరే దేమి.
- what would you have from me ? నన్నుంచి నీ కేమి కావలసివున్నది.
- they will not let you have it దాన్ని నీకు దొరకనివ్వరు.
- have is often the sign of the causal voice; thus; I had it brought తెప్పిస్తిని.
- I had a letter written జాబు వ్రాయించినాను.
- I had it woven నేయించినాను.
- I had it weighed తూపించినాను.
- Iwould have you go and tell him this నీవు పోయి అతనితో చెప్పవలసినది.
- I wouldnot have you think so నీవు అట్లా యెంచరాదు.
- I would have you to know this iswrong యిది కారానిది సుమీ.
- this has nothing to do with it అందుకు యిందుకుసమ్మంధము లేదు, యిది యెక్కడ అది యెక్కడ.
- you must have your wits about youజాగ్రతగా వుండు.
- you must have patience నీకు వోర్పు వుండవలెను.
- he will have it thatyou told him నీవు చెప్పినావని సాధిస్తాడు.
- they had him in honour వాణ్నిగౌరవముగా విచారించినారు.
- they had him in contempt వాణ్ని అలక్ష్యము చేసినారు.
- I have now to pay the money ఆ రూకలు నేను యిప్పుడు చెల్లించవలసివచ్చినది.
- theyhad him up into the castle అతణ్ని కోటలోకి తీసుకొని పోయినారు.
- he had his will of her or he had to do with her దానితో పోయినాడు.
- have done ! అంతమట్టుకు చాలించు.
- have at you ! భద్రము, కత్తి దూసుకొని వొకడి మీదికి పొయ్యేటప్పుడు చెప్పేమాట.
- Have a care ! జాగ్రత కలిగి వుండు, భద్రము.
- had it not been for him I should have died అతడు లేకపోతే నేను చత్తును.
- had he come I would have paid them అతను వచ్చివుంటే నేను యిచ్చివుందును.
- Rumour has it that they are descended from him వాండ్లు అతని సంతతి యని వదంతి కలదు.
- I have to deal with a great rogue నాకు వక క్షుద్రుడితో వ్యాపారము చేయవలసివచ్చినది.
- I had ratherdie than do so అట్లా చేయడము కంటే నేను చావడము మేలు.
- I had rather pay the money myself ఆ రూకలు నేనే యిస్తేవాసి.
- he had the worst of it వోడినాడు.
- he had the best of it జయించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).