hold

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పట్టు.

 • we roused the tiger from his hold ఆ పులిని దాని వునికి పట్టులో నుంచి లేపినాము.
 • he caught hold of the rope దారాన్ని పట్టుకొన్నాడు.
 • he got hold of the house ఆ యింటిని లంకించుకొన్నాడు.
 • this stone gives no hold to the beam ఈ రాయి ఆ దూలమునకు ఆధారముగా వుండలేదు.
 • this handle is not long enough,it does not give a good hold ఈపిడి నిడివి చాలనందున పట్టుకోవడమునకు వుసులుగావుండిలేదు.
 • he kept his hold for two hours రెండు ఘడియల దాకా పట్టినపట్టు వదలలేదు.
 • he laid hold of my hand నా చేతిని పట్టుకొన్నాడు.
 • he lost his hold వాడి పట్టువదిలిపోయినది.
 • he quitted his hold పట్టును విడిచినాడు.
 • he seized hold of me నన్నుపట్టుకొన్నాడు.
 • he took hold of the stick కర్రను పట్టుకొన్నాడు.

క్రియ, నామవాచకం, పట్టుట, తాళుట, లగించుట, ఇముడుట, పొసగుట, ఎంచుట.

 • they holdthat this is false ఇది అబద్ధ మనుకొన్నారు.
 • the wood broke but the leather held కొయ్య విరిగినది అయితే తోలు నిలిచినది.
 • the rule does not hold here ఆ సూత్రము ఇక్కడ చెల్లదు.
 • why should you hold back ? నీవు యెందుకు వెనకతీస్తావు.
 • he held forth all night రాత్రి అంతా మాట్లాడుతూ వుండినాడు.
 • he could not hold from weeping ఏడ్పును పట్టలేక పోయినాడు.
 • the principle does not hold good in practice ఈ సిద్ధాంతము అనుభవమునకు సరిపడదు.
 • this holds good in all parts of India ఇండియా దేశములో సర్వత్ర యిది సహజమే.
 • she was very angry but held in for a long time దానికి బహు కోపము వుండినది అయినప్పటికిన్ని శానా సేపు తాళినది.
 • I desired to hold off వాణ్ని కడగా వుండమన్నాను.
 • the trade held on for many years ఆ వర్తకము అనేక సంవత్సరములు జరుగుతూ వచ్చినది.
 • he held on his course నిలువక సాగిపోయినాడు.
 • the fort held out for two months against the enemy ఆ కోట శత్రువులకు స్వాధీనపడక రెండు నెలల దాకా నిలిచినది.
 • he will certainly die but I think he may hold out for two months వాడు సిద్ధముగా చస్తాడు అయితే రెండు నెలలు తాళునేమో.
 • this mortar's together well, they put hair in it గచ్చు బాగా కర్చుకొంటున్నది, అందులో వెంట్రుకలను కలుపుతారు.
 • this story does not hold together well ఈ కథలో వొకటికొకటి అసందర్భముగా వున్నది.
 • Many hold to this belief ఈ నమ్మిక శానా మందికి కద్దు.
 • this king had several barons holding under him ఆ రాజుకు తనకు లోబడ్డ జమీందారులు శానామంది వుండినారు.
 • it rained in themorning but held up at noon తెల్లవారి వాన కురుసినది మధ్యాహ్నము వెలిసినది.
 • almost all the bramins hold with their great divine Shankara chari శానామంది బ్రాహ్మణులు శంకరాచార్యుల అవలంబించి వున్నారు.
 • hold hold! తాళుతాళు.

క్రియ, విశేషణం, పట్టుట.

 • he holds the sceptre in his hand వాడు శెంగోలును చేతపట్టుకొని వుంటాడు.
 • the child could not hold the fruit and let it fall ఆ బిడ్డ పండును చేత పట్టుకోలేక పడవేసినది.
 • he held the goat by the horns ఆ మేకకొమ్ములను పట్టుకొన్నాడు.
 • this box will not hold all the books ఆ పుస్తకాలంతా యీపెట్టెలో పట్టవు.
 • broken cisterns that can hold no water పగిలినందున నీళ్ళు నిలవనితొట్లు.
 • the cocoanut holds water టెంకాయలో నీళ్ళు వున్నవి.
 • this stone holds goldఈ రాతిలో నీళ్లు వున్నవి.
 • this stone holds gold ఈ రాతిలో బంగారు వున్నది.
 • they holdthis right ఇది న్యాయమని అంటారు.
 • they hold this wrong ఇది అన్యాయమను కొంటారు.
 • nothing took place that could beheld unjust అన్యాయమన్నది జరగలేదు.
 • or to esteem ఎంచుట.
 • thus : they held him a fool వాణ్ని పిచ్చి వాణ్ణిగా యెంచినారు.
 • he holds me his enemy నన్ను శత్రువను కొంటాడు.
 • he holds them in esteem వాండ్లను గౌరవము చేస్తాడు.
 • he holds them in scorn వాండ్లను అలక్ష్యము చేస్తాడు.
 • or to restrain అణచుట.
 • he could not hold his anger in వాడు కోపమును అణచలేకపోయినాడు.
 • they held the castle కోటను కాపాడుకొన్నారు.
 • the enemy still holds the town శత్రువులుఇంకా పట్టణమును వదలలేదు.
 • he holds the command of the army వాడు సేనాధిపతిగావున్నాడు.
 • they held a conversation for two hours రెండు ఘడియల దాకామాట్లాడుతూ వుండినారు.
 • they held a council ఆలోచించినారు.
 • he still held hiscourse (or, way,) నిలువక సాగిపోయినాడు.
 • the king held court to-day నేడు రాజు కొలువు కూటమునకు వచ్చినాడు.
 • he held a fast ఉపవాసము వుండినాడు.
 • heheld a feast పండుగ చేసినాడు.
 • he was about to fire but on seeing who it was he held his hand కాల్చబోయి ఫలానివారని తెలిసిన మీదట మానుకొన్నాడు.
 • they held a meeting సభ కూడినారు.
 • the two Judges held the same opinion ఇద్దరి న్యాయాధిపతులదిన్ని వొకటే అభిప్రాయముగా వుండినది.
 • they asked him but he held his peace వాణ్ని అడిగినారు అయితే వాడు నోరు తెరవలేదు.
 • but still he held his purpose అయినప్పటికిన్ని వాడు తన కార్యాన్ని విడవలేదు.
 • they held service or held prayers in that hall ఆ కూటములో పూజను జరిగించినారు.
 • he holds the situation of minister వాడు మంత్రి వుద్యోగములో వున్నాడు.
 • hold your tongue నోరు ముయ్యి.
 • he held back the money రూకలను బిగపట్టినాడు.
 • he held down his head తలను వేలవేసుకొన్నాడు.
 • he held forth promises వాగ్దత్తములను మహాచేసినాడు.
 • the doctors holds forth hopes of her recovery వైద్యుడు దానికి స్వస్థమౌనంటాడు.
 • he held horse in గుర్రమును యీడ్చి పట్టినాడు గుర్రమును నిల్పినాడు.
 • he held in his breath ఊపిరిని బిగపట్టినాడు.
 • in the sluice there are stones to hold the water in నీళ్ళను నిలుపడానకు అలుగులో రాళ్లు వున్నవి.
 • they hold their land of me నా నేలను వాండ్లు గుత్తకు పుచ్చుకొన్నారు.
 • they held me off నన్ను దగ్గిర చేయనియ్యలేదు.
 • they held him tohis promise చెప్పిన ప్రకారము చేయుమని వాణ్ని నిర్బంధించిరి.
 • the wind held the kite from falling గాలిపటమును పడకుండా గాలి నిలిపినది.
 • he began the study and held it on for two years చదవనారంభించి రెండేండ్ల దాకా జరిగించినాడు.
 • heheld out his tongue నాలుకను చాచినాడు.
 • he held up his head తలను యెత్తినాడు.
 • this beam holds up the stone ఈ దూలము ఆ రాతికి ఆధారముగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hold&oldid=965189" నుండి వెలికితీశారు