please
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- సంఖ్యా జాబితా అంశం
(file)
క్రియ, విశేషణం, సంతోషపెట్టుట, సంతుష్టి చేసుట,ఆనందింప చేసుట.
- he pleaseed with the news he brought యీ సమాచారము తెచ్చి నన్ను సంతోష పెట్టినాడు.
- he pleased them with promises నోటి మాటల చేత వాండ్లను సంతోషపెట్టినాడు.
- this does not pleasehim యిది వాడికి సమ్మతము కాదు.
- no food can please him long వాడికి యేఆహారమున్ను నిండా దినాలు సయించదు.
- no one can please him long వాడికి యెవడిమీదనున్ను నిండా దినాలు విశ్వాసము వుండడము లేదు.
- flowers please the sight and smell పువ్వులు కంటికిన్ని ముక్కుకున్ను యింపుగా వుంటవి.
- he pleased himself with thinking that he had now succeeded తుదకు జయిస్తిని కదా అని సంతోషపడుతూవుండెను.
- if it please God that I live ten years longer దేవుడి దయవల్ల నేను యింకాపది యేండ్లు బ్రతికి వుంటే.
- will you please to come here ? యిక్కడికి దయచేస్తారా.
- if you please you may go there తమకు యిష్టమైతే అక్కడికి పోవచ్చును.
- I will do as you please నీ యిష్ట ప్రకారము చేస్తాను.
- give it me if you please దాన్ని నాకు దయ చేయండి.
- call her what name you please she certainly lives with him దాన్ని నీవుయేమన్నాసరే మెట్టుకు అది వాడి యింట్లో కాపురమున్నది, అనగా అది వాడికి లంజ అన్నా సరే, పెండ్లాము అన్నా సరే, బానిస అన్నాసరే, మెట్టుకు వాడింట్లోకాపురమున్నదని అర్థము.
- say what you please you must pay the money నీవు యేమిచెప్పినా సరే ఆ రూకలు చెల్లించక విధిలేదు.
- the prince was pleased to go there రాజుగారు అక్కడికి విజయము చేసిరి.
- he was pleased at this యిందుకు సంతోషించినాడు.
- she told whomsoever she pleased కన్నవాండ్లతో చెప్పినది.
- he is pleased with their conductవాండ్లు చేసేది వాడికి యిష్టమే.
- please your honor I went there నేను అక్కడికి పోయినాను స్వామీ నేను అక్కడికి పోయినాను అయ్యా.
- please to excuse me క్షమించండి,తమరు క్షమించవలెను.
క్రియ, నామవాచకం, ఆమోదించుట మెచ్చుట.
- the king pleased to grant me this or the king was pleased to grant me this రాజుగారు దీన్ని నాకు దయచేసి యిచ్చినారు.
- he did as he pleased వాడికి యిష్టమైనట్టు చేసినాడు.
- whichever you please యేదయినా సరే.
- take which you please నీకు సమ్మతి అయినది యెత్తుకో.
- just as you please నీ మనసు, నీచిత్తము.
- I was pleased to see this దీన్ని చూచి సంతోషిస్తిని.
- can he be pleased at this ? దీనికి అతడు మెచ్చునా.
- as much land as he pleased వాడికి కావలసినంత నేల.
- you may eat whatever you please నీకు కావలసినది తిను.
- he pleased to say so అట్లా దయచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).