Jump to content

prejudice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, Prepossession, judgement formed beforehand without examination విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి.

  • prejudice against విరోధము, విరుద్ధము, అనగా నిర్హేతుకమైన అసహ్యము prejudice in favour of పక్షము, అభిమానము, అనగా నిర్హేతుకమైన విశ్వాసము .
  • Bias పక్షపాతము.
  • some of the English have a prejudice against rice యింగ్లీషు వారిలో కొందరికి బియ్యము కారాదని వొక పిచ్చి నిష్కర్ష కలదు.
  • prejudices are removed by education చదువు వల్ల దురభిమానములు పోతవి.
  • a Philosopher is a man without prejudicesతత్వజ్ఞాని దురభిమానము లేనివాడు, పిచ్చిభ్రమలు లేనివాడు.
  • a judge should be free from prejudice s న్యాయాధిపతి దయాదాక్షిణ్య విహీనుడుగా వుండవలసినది.
  • the English has a prejudice that the Highlanders ate children ( See in proof the Chevalier Johnstone. page .101.) చెంచు వాండ్లు బిడ్డలను తిన్నారని ఇంగ్లీషు వాండ్లకు వొక పిచ్చి తలంపు వుండినది.
  • The Hindus prefer eating with the hand : the English will eat with the hand : in this both the Hindu and the Englishman are guided by prejudice హిందువులు చేతితో తినడము మేలు అంటారు, యింగ్లీషువారు చేతితోయెంతమాత్రమున్ను తినరు, యీ విషయములో హిందువులకున్ను యింగ్లీషు వారికిన్ని వుభయులకున్నువుండేది వట్టి దురభిమానమేను.
  • The Musulmans have a prejudice against the ( తొండ ) camelion which they kill wherever they find it తురకలు తొండను చూచిన చోట చంపుతారు దాని మీద వాండ్లకేమోవొక పిచ్చి వైరము.
  • he has a prejudice in my favour I being his relation బంధువుణ్నిగనక అతనికి నా యందు అభిమానము.
  • he had a prejudice against me because he hatedmy father నా తండ్రి యందు వాడికి విరోధము గనక నా యందున్ను విరోధముగా వుండెను.
  • through a prejudice which he had in their favour వాండ్ల యెడల వుండే అభిమానమువల్ల.
  • through a prejudice which he entertained against them వారి యెడల వుండే విరోధమువల్ల.
  • every parent has a prejudice in favour of his child కాకికి తన పిల్లే బంగారుపిల్ల.
  • Prejudice, ( as meaning, mischief, detriment, hurt, harm ) హాని,నష్టము,చెరుపు, వుపద్రవము.
  • this rain did a prejudice to the crop ఈ వర్షము పంటకు చెరుపు.
  • drinking does a prejudice to the health తాగడము వొంటికి చెరుపు.
  • Prejudice is wilful blindness; and thus is in these texts renderedblindness; Mark III. 5. Rom. XI. 25. Porosis. Eph. IV. 18. అంధకారము. A+ అంధతా A+ the veil is over their hearts .Cor.III.15.
  • ప్రచ్ఛాదనం. A+.

క్రియ, విశేషణం, విరోధమును కలగ చేసుట.

  • he prejudiced the king against meరాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prejudice&oldid=941089" నుండి వెలికితీశారు