rather
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, more willingly with better liking మనఃపూర్వకముగా,మనసార,ఇష్టముగా.
- somewhat కాస్త, కొంచెము, రవంత.
- preferably to the other; withbetter reason ఉత్తమము, మేలు, వాసి.
- in a greater degree than otherwise బహుశా, సుఖముగా, హాయిగా.
- especially ముఖ్యముగా, విశేషముగా.
- moreproperly యుక్తముగా, సరిగ్గా.
- this is the picture of a cow or rather of a buffaloఇది ఆవుపట మనేటందు కంటె బహుశః యెనుముపట మన వచ్చును.
- he wore a capor rather a turband on his head వాడు వేసుకొన్నది కుళ్లాయివలె వున్నదనడమున కంటెబహుశా పాగవలె వున్నదనవచ్చును.
- he lived in a house or rather a hovel on thehill కొండ మీది వొక యింట్లో వుండినాడు అది యిల్లనరాదు అయితె వొక గుడిసెలోవుండినాడు.
- the fruit is like a lime or rather an orange అది నిమ్మపండు వంటిదిఅయితే సరిగ్గా కిచ్చిలి పండువంటిది.
- this feels like silk or rather like shawl దీన్నితాకితే పట్టువలె వున్నది, అయితే సరిగ్గా శాలువ వలె వున్నది.
- this tastes of salt or rather of saltpetre దీన్ని నోట్లో వేసుకొంటే వుప్పువలె వున్నది అయితే సరిగ్గా పెట్లుప్పువలె వున్నది.
- rather a slender sword కొంచెము సన్నపాటి కత్తి.
- the stick was rather big ఆ కర్ర రవంత లావుగా వుండినది.
- this is rather large ఇది కొంచెము పెద్దది.
- this is rather black ఇది రవంత నల్లగా వున్నది.
- I think the price is rather high ఇప్పుడు కొంచెము వెల పొడిగి వున్నదేమో.
- rather than see it he ran away దాన్ని చూడలేక పారిపోయినాడు.
- I had rather read Telugu than Tamilఅరవాని కంటె తెలుగు చదవడము నాకు యిష్టముగా వున్నది.
- why should I go ? I had rather stay at home today బయిట యెందుకుపొయ్యేదినేడు హాయిగా యింట్లో కూర్చుంటాను, బయిట యెందుకు పొయ్యేది యీ వేళ యింట్లో వుండడము నాకు సంతోషము.
- he had rather die than submit ఒకనికిలొంగడము కంటె వాడికి చావడము యిష్టము, లోబడేటందుకంటె సుఖముగా ప్రాణమువిడుచును.
- you may go on horse back I had rather go on foot నీవు కావలిస్తేగుర్రము మీదపో, నేను హాయిగా నడిచివస్తాను.
- I will not give rupees I would rathergo without అది లేకపోయినా పోతున్నది గాని నేను పది రూపాయలు ఇవ్వను.
- theyhad rather eat rice than bread; but they would rather die than eat flesh రొట్టెనుతినడము కంటె వాండ్లకు అన్నము తినడము యిష్టము, వాండ్లు మాంసమును తినడమునకంటె సుఖముగా ప్రాణమును విడుతురు.
- he would rather drink wine than water నీళ్ళకంటె వాడికి సారాయి తాగడము యిష్టము.
- I will read this but I would rather readSanscrit దీన్ని చదువుతాను గాని అయితే నా మనసంతా సంస్కృతము మీద వున్నది.
- Iwould rather go tomorrow రేపు పోతే మంచిది, రేపు పోతే వాసి.
- I was notdistressed for food but rather had plenty నాకు కూటికి కష్టమనేది లేదు నా వద్దవిస్తారము వుండెను.
- he is not ignorant he is rather a good scholar వాడు శుద్ధతెలియని వాడనేది యెక్కడ వాడు కొంచెము చదువుకొన్న వాడాయెనే.
- do you call .
- her .
- agirl ? she is a rather woman దాన్ని పడుచు అంటావా అది యెక్కడ పడుచు అది నిండుఆడదాయెనే.
- it israther too much to hear such a man abused అట్లాంటి వాణ్నిదూషించగా వినడమనేటిది యెంత మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).