shake
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కదిలించుట, కుదిలించుట, ఆడించుట.
- the fever shook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది.
- the earthquake shook down the house భూకంపము చేత ఇల్లు పడ్డది.
- he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.
- they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక.
- he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు.
- he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు.
- he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు.
- she shook up the bed పడకను దులిపి వేసినది.
క్రియ, నామవాచకం, కదులుట, అల్లాడుట, ఆడుట, వణుకుట.
నామవాచకం, s, motion కదలడము, ఆడడము.
- he gave a shake with his head తల వూచినాడు.
- by the shake of his head I saw that he was ill వాడి తల ఆడడము చూచివాడికి జ్వరము వచ్చినట్టు నాకు తోచినది.
- a shake in music మూర్ఛన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).