slip

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, జారుట, జారిపడుట, జరుగుట.

  • his foot slippedవాడికాలు జారినది.
  • his knee is slipped వాడి మోకాలు బెణికినది.
  • his ankle joint slipped వాడి చీలమండ తొలిగినది.
  • the knot slipped ఆ ముడి జారిపోయినది, వూడిపోయినది.
  • he let the opportunityslip సమయాన్ని పోగొట్టుకొన్నాడు.
  • the time slipped away very fast కాలము తెలియకుండా జరిగిపోయినది.
  • I slipped down జారిపడ్డాను.
  • she slipped out of the house ఆ యింటిని విడిచి వుపాయముగా అవతలికి పారిపోయినది.
  • the hook slipped out of the fishs mouth గాలము చేప నోట్లోనుంచి జారివచ్చినది.
  • the fish slipped out of his hand చేప వాడిచేతిలోనుంచి జరిగిపోయినది.
  • you have let the business slip through your fingers ఆ వుద్యోగమును నీకు అందకుండాపోగొట్టుకొన్నావు.
  • this slipped out of his memory దీన్ని వాడు మరచినాడు.
  • the bolt slipped back గడియ వూడిపోయినది.

క్రియ, విశేషణం, జార్చుట, జారవిడుచుట.

  • he slipped a dog at the fox నక్కమిదకి కుక్కును విడిచినాడు.
  • he slipped the handkerchief into his pocket రుమాలును జేబిలోనికి జారవిడిచినాడు.
  • she slipped the ring off her finger వేలి వుంగరమును తీసినది.
  • he slipped out some words by which I perceived the truth.
  • వాడికే తెలియకుండా నోరుతప్పి వచ్చిన మాటలవల్ల నిజమును కనుక్కొన్నాను.
  • she slipped the ring upon her finger వేలికి వుంగరము పెట్టుకొన్నది.

నామవాచకం, s, the act of slipping జారడము, జరగడము.

  • a long narrow piece సన్నగా వుండేటిది.
  • there is a slip of land between the two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది.
  • a slip of ivory సన్నదంతపు పలక.
  • a slip of cloth పేలిక, గుడ్డతునక.
  • a slip of wood కొయ్యతునక.
  • a slip of paper కాకితపు ముక్క.
  • by a slipof memory జ్ఞాపకము తప్పినందున.
  • a slip of the tongue నోరు జారి వచ్చినమాట.
  • he did not mean this it was a mere slip of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు.
  • a slip set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ.
  • when she was a young slip అది పసిదిగా వుండినప్పుడు.
  • as part of a womans dress పావడ.
  • a leash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slip&oldid=944479" నుండి వెలికితీశారు