spread

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పరుచుట, చాచుట.

  • he spread the paper before meఆ కాకితాన్ని విచ్చి నాకు చూపినాడు.
  • the bird spread its wings పక్షి రెక్కలను విచ్చినది.
  • he spread his arms చేతులు బారచాచినాడు.
  • he spread his hand or his fingers ముడుచుకొన్న చేతిని తెరిచినాడు.
  • he spread the cloth గుడ్డ పరచినాడు.
  • he spread the mat చాప వేసినాడు.
  • he spread the umbrella వాడు ఆ గొడుగును విచ్చినాడు.
  • after the flower spread its bosomపుష్పము వికసించిన తర్వాత.
  • she spread the butter on the bread రొట్టె మీద వెన్న చరిమినది.
  • he spread the earth over the rock ఆ రాతి మీద మన్ను పరచినాడు, నెరపినాడు.
  • he spread the plaister on the cloth గుడ్డకు ప్లాస్త్రి చరిమినాడు.
  • the cobra snake spread its crest పాముపడగ యెత్తినది.
  • this spread the disease యిందువల్ల యీ రోగము వ్యాపించినది.
  • she spread (or spread out)the corn on the floor అది ధ్యానమును నేలపోసి నెరపినది.
  • he spread the table మేజ వేసినాడు, భోజనము వడ్డించినాడు.
  • they spread the news ఆ సంగతిప్రచురము చేసినారు.

క్రియ, నామవాచకం, to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట.

  • the clouds spread over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది.
  • the smoke spread over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది.
  • this new spreads throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది.
  • the creepers spread over wall తీగలు గోడమీద అల్లుకొన్నది.
  • the ants spread through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.

విశేషణం, వ్యాపించిన, చాచిన, మూసుకొన్న.

  • the disease spread by this wind యీ గాలి వల్ల వ్యాపించిన రోగము.
  • the news spread by these papers యీకాగితమువల్ల ప్రచురమైన సమాచారము.
  • Lord Bacon in his Essay On Seditions, spread'spread 10 says Money is like muck, no good unless it be spread రూకలనున్ను పేడనున్ను వ్యాపింప చేస్తేనే గాని పనికిరావు.

నామవాచకం, s, extent, compass వ్యాపకత్వము, విరివి.

  • this prevented the spread of the disease యిందువల్ల ఆ రోగము యొక్క వ్యాపకత్వముఅణిగిపోయినది.
  • this promoted the spread of his opinions యిందువల్లవాని మతము ప్రచురమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spread&oldid=945064" నుండి వెలికితీశారు