stay
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, ఉండుట, కాచుకొని వుండుట, తాకుట, నిలుచుట.
- the medicine did not stay on his stomach ఆ మందు వాడి కడుపులో యింద లేదు.
- they came but they did not stay వచ్చినారు గాని వాండ్లు యిక్కడనిలువలేదు.
- I stayed for you నీవు వస్తావని కనిపెట్టుకొని వుంటిని.
- two came but the other three stayed away యిద్దరు వచ్చినారు కడమముగ్గురు రాక నిలిచినారు.
- why do you stay away from his house? వాడియింటికి యెందుకు రాకుండా వున్నావు.
- they stayed behind వాండ్లు వెనక చిక్కినారు.
- you should not stay up so late నీవు అంతసేపు నిద్ర మేలుకొని వుండరాదు.
- he stayed up all night రాత్రి అంతా మేలుకొనివుండినాడు.
క్రియ, విశేషణం, to stop అణచుట, నిలుపుట.
- he took this to stay his stomach దీన్ని ఫలహారముగా పుచ్చుకొన్నాడు, ఆకలికి దీన్ని నోట్లోవేసుకొన్నాడు వమనము కాకుండా వుండడానకై దీన్ని నోట్లో వేసుకొన్నాడు.
- this stayed my journey యిందు వల్ల నా ప్రయాణము నిలిచినది.
- these words stayed her spirit యీ మాటలవల్ల దానికి ధైర్యము వచ్చినది.
నామవాచకం, s, నిలవడము, ఉండడము, ఉనికి.
- my stay there enabled me to see him నేను అక్కడ వుండినందున వాణ్ని చూడడము సంభవించినది.
- during my stay in the town నేను పట్టణములో వుండేటప్పుడు.
- without stop or stay నిరాటంకముగా.
- he is the main stay of the family ఆకుటుంబానికి వాడు ఆధారముగా వున్నాడు.
- a womans stays లోగా బద్దలుపెట్టి కుట్టి స్త్రీల నడుముకు బిగువుగా కట్టుకొనే వొక విధమైన రవిక.
- stay lace వొక విధమైన తాడు.
- the stay or stays of a ship వాడ స్థంభానికిఆధారముగా ముందరితట్టుకు యీడ్చి కట్టియుండే పగ్గము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).