draw
Appearance
(to draw నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, నామవాచకం, తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.
- the boil draws పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.
- the matter is drawing to a close ఆపని ముగియవచ్చినది.
- the marriage is now draw ing near పెండ్లి దగ్గరికొస్తున్నది.
- he drew a sideవొత్తినాడు తొలగినాడు.
- to draw back వెనక్కు తీసుట.
- they drew near him వాడి దగ్గరికి వచ్చినారు.
- the feast draws nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది.
- the people drew togetherజనము కూడినది.
- It is drawing towards evening అస్తమానముకావచ్చినది.
- he drew up to me నా సమీపమునకు వచ్చినాడు.
- they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు.
- I drew up at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను.
- he drew upon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు .
- he drew upon me for money నాపేరట హుండి వ్రాసినాడు.
క్రియ, విశేషణం, to pull యీడ్చుట, లాగుట, ఆకర్షించుట.
- the infant draws the breast బిడ్డ చన్నుకుడుస్తున్నది.
- to draw milk పాలుపితుకుటపాలుపిండుట.
- to draw blood నెత్తురుతీసుట.
- to water నీళ్లుచేదుట, నీళ్లు చల్లుట.
- to draw water by means of a swape యేతాముచల్లుట.
- he drew some watert into his mouth కొంచెము నీళ్లు జుర్రినాడు.
- she drew beer for him అది వాడికి బీరు అనే సారాయి వంచుకుని వచ్చి యిచ్చినది.
- to draw toddy కల్లు దించుట, కల్లు గీచుట.
- to draw a line గీత గీసుట.
- to draw a sword కత్తిని దూసుకొనుట.
- ro draw a thread నూలు వడుకుట.
- to draw wire కమ్ములు యీడ్చుట.
- I derew the secret out of him వాడి మర్మాన్ని బయటతీస్తివి.
- I cannot draw my breath వూపిరివిడవలేను.
- I drew my first breath there నేను ఆ స్థలములోపుట్టినాను.
- he drew his last brath here వాడు యిక్కడ చచ్చినాడు.
- to draw a sigh నిట్టూర్పు విడుచుట.
- to draw a tooth వైద్యుడుపంటినిపెరుకుట.
- to draw conclusions in logic అనుమేయించుట, ఊహించుట.
- to draw the curtain తెరవేసుట.
- he drew a veil over those affairsఆసంగతులను మరుగుగా పెట్టినాడు.
- to draw aside తొలగదీసుట.
- to draw lots చీట్లు యెత్తుట.
- to draw money రూకలు తీసుట.
- It drew my attention యిందుచేత నాకు హెచ్చరిక అయినది, కనుక్కొన్నాను.
- they draw an essence from chillies మిరపకాయలలో ద్రావకముదించుతారు.
- this drew tears from him యిందుచేత వాడికంట్లోనీళ్లువచ్చినది.
- this drew a strange remark from himయిందుచేత అతను వొక వింతమాట చెప్పినాడు.
- he was hangeddrawn, and quartered వాణ్ని వురిదీసి దించి కడుపు కోసి పేగులుతీసి శవాన్ని నాలుగు తునకలు చేసినారు.
- the brigs drawingvery little water were bale to go close to the shore యీ వాడలుకొంచెము నీళ్లలో తేలుతవి గనుక గెట్టుదగ్గిరికి పోగలవు.
- the ship drawstheree feet water ఆ వాడ నీళ్లలో మూడుడగులున్ను కడమబయటనున్ను వుంటున్నది.
- the ship drew three feet; butafter the guns were put in she drew four ఆ వాడ మూడడుగులుమునిగివుండినది, అయితే పిరంగులు యెక్కించిన తరువాత నాలుగుఅడుగులు మునిగింది.
- (in painting ) వ్రాసుట.
- to draw back వెనక్కుతీసుట.
- he drew his hand back వాడిచేతిని వెనక్కుతీసుకోన్నాడు.
- thiswill draw down a calamity యిందుచేత వ్యాకులము వస్తున్నది.
- this drew forht his applause యిందుచేత శ్లాఘించినాడు.
- thisdrew forht his admiration యిందుచేత స్తుతించినాడు.
- hedrew in his horse గుర్రమును కళ్లెము యీడ్చి నిలిపినాఢు.
- to draw in the breath వూపిరినిలోగా తీసుకోనుట.
- they drew me into theplot నన్ను ఆకుట్రలో కలియవేసుకున్నారు.
- he drew the shoe offజోడు తీసివేసినాడు.
- he drew the water off నీళ్లు వడిసిపొయ్యేలాగుచేసినాడు.
- he drew me off నన్ను తొలిగించినాడు.
- he drew the mob offఆ గుంపును కూడా తీసుకోని పోయినాడు.
- he drew the shoe onజోడు వేసుకున్నాడు.
- I will draw out a letter నేను వొక జాబు వ్రాస్తాను.
- he drew out an account వాడు వొక లెక్క వ్రాసినాడు.
- he drewout ot draw up the troops సేనను వరసగా నిలిపినాడు.
- to draw out a thorn నాటిన ముల్లుతీసుట.
- she drew her hand over his face అదివాడి ముఖమును తుడిచింది.
- he drew his foot over it దాన్నితొక్కినాడు.
- he drew his tongue over it దాన్ని నాకినాడు.
- he drew himself up or crouched దేహమును ముడుచుకున్నాడు.
- or exected his head నిక్కినాడు.
క్రియ, విశేషణం, (add,) he drew a long bow జల్లి కొట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).