want
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to be without, to need కొరతగా వుండుట, లేక వుండుట, అక్కరవుండుట, ఆశించుట, కోరుట.
- I want it అది నాకు కావలెను.
- I do not want that అది నాకు అక్కరలేదు, వద్దు.
- I do not want water నాకు నీళ్ళతో పనిలేదు.
- I do not want him to sit here వాడు యిక్కడ కూర్చుండ వలెనని నాకు అక్కరలేదు.
- come here I want you యిందా నీతో పనివున్నది, యిక్కడికిరా, పనివున్నది.
- he wants manners వానివద్ద మర్యాదలేదు.
- what do you want ? నీ కేమి కావలెను, నీ వేమి పనికి వచ్చినావు.
- he wants you వాడు నిన్ను పిలుస్తాడు,రమ్మంటాడు.
- what I want is a light నాకు కావలసినది దీపము.
- the horse wants an ear ఆ గుర్రానికి వౌక చెవి తక్కువ.
- this house wants width యీ యింటికి వెడల్పు తక్కువ.
- this beam wants length యీ దూలమునకు నిడువు చాలదు.
- she wants the use of her two handsఆపెకు రెండు చేతులూ స్వాధీనము లేదు.
- begin this work and you shall not want aid యీ పనిని ఆరంభించు, నీకు కావలసిన సహాయము నేను చేస్తాణు.
- he wants several of his teeth వానికి కొన్ని పండ్లు పోయినవి.
- this spear wants a head యీ బల్లెము మొణపోయినది.
- the carriage wants a wheel యీ బండికి వొక చక్రము లేదు.
- he wants nothing వానికి యేమిన్ని తక్కువలేదు.
- It wants an hour of noon మధ్యాహ్నము కావడానకు యింకా గంట తక్కువ వున్నది.
- rich men never want flatterersభాగ్యవంతులకు పొగిడేవాండ్లు తక్కువా.
- the unhappy never want enemies? దౌర్భాగ్యులకు శత్రువులు లేక వుండరు.
- I want to go to Nellore నెల్లూరికి పోవలెనని వున్నాను, నాకు నెల్లూరికి పోవలసి వున్నది.
- the book that is wanted కావలసి వుండే పుస్తకము you have been wanting to yourself in this business యీ పనిలో నీవు అశ్రద్ధచేసినావు.
నామవాచకం, s, need; necessity, deficiency; defect అక్కర, అగత్యము,లేమి, తక్కువ, కొదవ, లోపము, వెలితి.
- poverty దారిద్య్రము.
- he supplied all my wants నాకు కావలసినదంతా జాగ్రత్త చేసినాడు.
- want of courage అధైర్యము.
- want of temper ఆతురము.
- want of appetite or digestion అజీర్ణము.
- want strength బలహీనము.
- want of energy పాలుమాలిలక.
- a man in want బిదవాడు, పేదవాడు.
- he is not in want వాడు బిదవాడు కాదు.
- want of money దారిద్య్రము.
- want of sense అవివేకము.
- want of knowledge అజ్ఞానము.
- want of judgement తెలివి లేమి, అవివేకము.
- he is in want of money to do this దీన్ని చేయడానకు వానికి రూకలు లేదు.
- I am in want of a guide నాకు దారి చూపేవాడు కావలెను.
- being in want of money రూకలు కావలసి.
- for want of sleep నిద్రలేనందున, చాలనందున.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).