way
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a road, passage; course of life, means, path మార్గము, దోవ, దారి, బాట, ప్రకారము, రీతి, క్రమము, విధం.
- not knowing which way to turn I spoke to him యెటూ తోచక అతణ్ని అడిగినాను.
- the best way will be to pay the money రూకలు చెలించడేమే ముఖ్యము, సరసము.
- one way or another you must pay the money నీవు యెటైనా ఆ రూకలు చెల్లించవలసినదే.
- in any way it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది.
- mark all the ways to do it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది.
- mark all the ways of a good man మంచి వాని రీతులనంతా గురుతుగా చూచి పెట్టుకో.
- I do not know the way to do it అది చేశై విధము నాకు తెలియలేదు.
- there is no way but to submit లోబడితేనేగానివేరేగతి లేదు.
- a hollow way డొంక.
- the high way రాజమార్గము.
- high way robbery దారికట్టి దోచడము.
- the ladder gave way నిచ్చెన వంగినది, విరిగిపోయినది.
- the bridge gave way ఆ వంతెన కుంగినది.
- he gave way to passion and cursed them వాడికి కోపమువచ్చి వాండ్లను తిట్టినాడు.
- at last his patience gave way తుదకు వాడి ప్రాణమువిసికినది.
- I gave way to him అతనికి నేను అడ్డము అడలేదు.
- why do you give way to your wife? నీ పెండ్లాన్ని మనుసువచ్చినట్టు యెందుకు నడవనిస్తావు.
- I made wayfor him నేను వాడికి తొలిగినాను, దోవ విడిచినాను.
- to make way or go on సాగుట.
- the ship made way వాడ సాగినది, వెళ్ళినది.
- he made hisway there in two days రెండు దినాలలో వాడు అక్కడికి పోయినాడు.
- he made the best of his way there వాడు అక్కడికి బహు త్వరలో పోయి చేరినాడు.
- the thieves made their way into the house దొంగలు యింట్లో జొరబడ్డారు.
- he went his way వాడు లేచి పోయినాడు.
- we went every man his way మేము తలా వొక దోవను పోతిమి, వారివారి పనికి వారు వారు పోయిరి.
- this medicinewent a great way to cure the disease యీ మందు ఆ రోగమును బహుశః స్వస్థము చేసినది.
- he will have his own way వాడు దురహంకారి, వాడు వొకరి మాట వినేవాడు కాడు.
- take your own way నీకు యెట్లా యుక్తమో అట్లాచెయ్యి.
- doorway వాకిలి.
- Adverbially గా.
- by way of rent బాడుగ రీతిగా.
- by way of settlement తీర్పుగా.
- by way of bridle కళ్ళెముగా.
- by the way ఐతే, మెట్టుకు, వింటివా, చూస్తివా.
- he was not then in the way వాడు అప్పట్లో యెదట లేకుండా వుండినాడు.
- it got in the way అది అడ్డపడ్డది.
- he wishes to do it, but his father was in the way చేశేటందుకు వాడికి యిష్టమేగాని వాడి తండ్రివల్ల అభ్యంతరమైనది.
- I was not in the way when he came వాడు వచ్చినప్పుడు నేను వుండలేదు.
- if nobodyelse was in the way అప్పుడు మరి యెవరూలేనట్టయితే.
- he is a verygood man in his way వాడి మట్టుకు వాడు పెద్ద మనిషి.
- she put this letter in his way ఈ జాబు వాని కండ్లపడేటట్టు పెట్టినది.
- that doubtwas in my way ఆ సందేహము నా పనికి అభ్యంతరమైనది.
- if the book comes in your way you may buy it ఆ పుస్తకము నీకు కండ్లబడితే కొను.
- in this way ఇట్లా.
- in that way అట్లా.
- in waht way ? యెట్లా, యెలాగు.
- It is made in the smae way as cloth అది గుడ్డ రీతిగా చేయబడుతున్నది.
- on my way back మళ్ళీరాగా, మళ్లీపోగా.
- on my way here నేను యిక్కడికివస్తూవుండగా.
- I wished to speak to him, but he was out of theway నేను మాట్లాడవలెనని వుంటిని గాని వాడు అప్పుడు ఉందలలేడు.
- pray do not put youself out of the way to do me this favour దీన్ని నాకు చేయడాన్ని గురించి తమరు నిండా ప్రయాశ తీసుకోవద్దు.
- he put himself out of his way to serve me నా కోసరము అతడు నిండా ప్రయాసపడ్డాడు.
- get out of the way దోవ విడుపు, తొలుగు.
- he kept out of the way for ten days పది దినాలు తల మరుగుగా వుండినాడు, దాగి వుండినాడు.
- out of the way or strange వికారమైన.
- they are out of the way people వాండ్లు వింత మనుష్యులు.
- this is an out of the way medicineయిది వొక way వింత మందు.
- he did this when I was out of the way నేను లేనపపుడు దీన్ని చేసినాడు.
- in some out of the way place యేదోవొక తప్పు స్థలములో.
- an out of the way place వౌక మూల, యెవరూయెరగని చోట వేసినది.
- he put it out of the way దాచినాడు.
- heput them out of the way వాండ్లకు దారితప్పేలాగు చేసినాడు, వాండ్లను దాచినాడు, వాండ్లను చంపినాడు.
- whenever I go to his house he isout of the way నేను యెప్పుడూ పోయినా వాడు యింట్లో వుండడు.
- the ship is now under way వాడ లంగరు యెత్తి సాగుతున్నది, అనగా వాడు బయిలుదేరినది.
- a great way నిండా దూరము.
- pretty ways or pranks వగలు, టక్కులు.
- a short way కొంచెము దూరము.
- the way of the world ప్రపంచ రీతి.
- a committee of ways and means రూకల బందోబస్తునుగురించిన సభ.
- if you wish to make war you must consider the ways and means యుద్ధము చేయవలెనని నీకు మనసు వుంటే ముందుగా సాగు సంపత్తిని విచారించవలసినది.
- when the propert found its way into his hands ఆ సోత్తు వాని స్వాధీనములో వచ్చినప్పుడు.
- characterswritten the wrong way as on a seal ముకురలిపి, అనగా అద్దములోచూస్తే సరిగ్గా అగుపడేటట్టు వ్రాశే అక్షరాలు.
- he is in a prosperous way వాడు శ్రేయోవంతుడుగా వున్నాడు.
- he is in a bad way వాడు దుర్ధశను పొంది వున్నాడు, వాడు చెడిపోయి వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).