అగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- అవుర.(ఆమ్రేడితమందు అగురగుర "క. అగురగుర ముఖరముఖుఁడై, జగము వినం దనబలంబు చాటె సముద్రుం, డొగి బిరుదు దక్కఁడయ్యెన్, సగర కుమారులుగదా ప్రశంసార్హతముల్." రామా. ౭, ఆ.)
(రూ. అగురా)
- విధేయవిశేషణమునకు అనఁగా విశేష్యము తరువాత నుపయోగించెడు విశేషణమునకు అన్వయసంపూర్తికి నుపయోగించు క్రియ.
"వాడు సదాచారుడయ్యె;"
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విశేషణమునకు విశేష్యమునకు అన్వయము కలుపుటకై యుపయోగించును. అప్పుడు క్రియాజన్య విశేషణముగానే యుండును. ="ధర్మపరుండగు రాజు;"
- పరిణమించు, మాఱు; ="సీ. ఒకమాటతప్పు గావక యహల్యాదేవి నక్షత్రపాదుఁడు ఱాయి యగు మనండె." శివ. మా.౩,ఆ. ౧౨౯;
- తగు, అర్హమగు; ఆవశ్యకమగు; ="క. ..కార్యజ్ఞానో, దారుడవగు నీవౌచి, త్యారూఢముగాఁగఁ జెప్పు మగుసమయమునన్." భార. అశ్వ. ౧,ఆ. ౧౪౭;
="తే. అగ్రమార్గజాగ్రన్నిభృతాపదంధు, బంధుసంరక్షణము పాడిబాంధవులకు, నైన కార్యంబు గానికార్యమును దెలిసి, యాడుడా యేను." నై.౩,ఆ. ౧౪౧;
- కలవాఁడగు. ="తే. ధర్మజుడు రాజసూయంబుఁ బేర్మిజేసి, నంతనుండియు నమ్మహితాధ్వరమున, యం దభిప్రాయమైయుండు నొంద నాకు, నమ్మఖంబు సేయింపవే యనఘ నన్ను." భార.అర.౬,ఆ. ౬౮; అభిప్రాయమైయుండు=అభిప్రాయము కలవాఁడయియుండు. ఇట్టిచోట సకర్మకక్రియగాని అన్వయింపవచ్చును;
- నెఱవేఱు, సిద్ధించు. ="తే. కార్యమగుటయు నరిగెదుగాక పిదప, నిల్వు మంతకు ననుటయు నీవు నన్ను, గదియకుండెదవేని నిల్చెద నధర్మ, వృత్తి వగుమని వారించె నత్తపస్వి." భార.అను.౨,ఆ. ౨౦;
- సిద్ధమగు.="సీ...శిఖి..రాజిన రవులుకోల్ వాసాలఁగాని కల్గదు మఱి దానఁ గలిగె, నేనిఁ గూడగుట నుందయినఁ బెన్బొగ సుఖభుక్తి సేకూరదు..." ఆము.౪,ఆ. ౧౨౭;
- సంపూర్ణమగు. ="పుస్తకము వ్రాఁత యైనది; భోజనములైనవి; చదువు అయినది." (అయినది=పూర్తియైనది;)
- ఓపు, సమర్థుడగు, చాలు. =(పాండవులు) "క. పరిచారకులై యుండుదు, రరివర్గ వ్యతికరమున కగుదురు వీరిన్, సరిఁ దనకొడుకుల మెలసిన, తెరువున మెలఁగింపవలదె ధృతరాష్ట్రునకున్." భార.ఉ.౧,ఆ. ౩౫౯;
- ఉండు, జీవించుయుండు. ="వ. అనిన విని కర్ణుండు గమలనాభుని పెంపును బార్థుబలిమియు నెఱుంగక యేనేల వారి దొడరెద నెట్లు సెప్పినను దొడరుదు దొడరి వారొండె నేనొండె నగుదు మింతియ నీవు వెడమాటలాడక యుడుగుమని పలికి." భార.కర్ణ.౨,ఆ. ౮౭;
- జరుగు. ="వారియింట పెండ్లియగుచున్నది."
స.క్రి.
1. కలుగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడెళ్ళిన పని అవునో కాదో