Jump to content

హంస

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
జంట హంసలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

1) విశేష్యం 2) విశేషణం

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నీటిపై ఆవాసముండే పక్షి , swan /శ్వేతగరుత్తువు.
  2. అంచ, ఒక తెగ యోగి, పరమాత్మ, తెల్ల గుర్రం, మంత్రాలలో ఒకటి, అజపా మంత్రం, శరీరంలోని వాయువులలో ఒకటి, మాత్సర్యం, శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి.
  3. పోయే, పరిశుద్ధమైన, హంసం/హంసము
  4. 1. తెల్లగా, అందంగా, బాతు ఆకారానికి దగ్గరగా ఉంటుందని ఊహ. వేదాల నుంచి నలదమయంతుల చరిత్ర వంటి కావ్యాల వరకు హంసను గురించి ప్రస్తావించాయి గాని, ఆధునిక కాలంలో వాటిని చూసినవారెవరూ లేరు. హిమాలయాలలోని మానస సరోవరంలో ఉంటాయని మరొక ఊహ. కాని, మానస సరోవరం చూసినవారెవరికీ హంసలు కనపడలేదు. గ్రీకు, ఇంగ్లీషు సాహిత్యాలలో సైతం హంసలను గురించి ఉంది. ఇంగ్లీషులో హంసను ‘స్వాన్‌’ అంటారు. అపోలో అనే దేవత హంస రూపం ధరించినదని గ్రీకు ఐతిహ్యం. హంస చనిపోయే ముందు అద్భుతంగా గానం చేస్తుందని గ్రీకు పురాణాల కాలం నుంచి ఒక నానుడి ఉంది. హంసను చూసినవారే లేరు గనుక హంసగీతాన్ని ఎవరైనా వినే ప్రసక్తిలేదు. ‘‘స్వాన్‌ సాంగ్‌’’ అంటే అంత్యకాలంలో గానంచేసే గీతమని వాడుకలోకి వచ్చింది. షేక్‌స్పియర్‌ ఒథెల్లో నాటకంలో ఎమిలియాచేత ఆమె మరణించే ముందు అనిపిస్తాడు ఇలా: ‘‘హంసనవుతాన్నేను. పాటలోనే ప్రాణం విడుస్తాను’’ (I will play swan and die in music’’) శ్రీహర్షుడి నైషధం, అది మూలంగా శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం గ్రంథాలలో హంస పాత్ర అద్భుతమైంది. భారతీయ సాహిత్యంలో హంస క్షీరనీరాలను వేరు చేయగలదనే ఒక విశ్వాసం కనిపిస్తుంది. వేద కాలంలో సోమరసం నుంచి నీటిని వేరు చేయగలదనే విశ్వాసం ఉండేదని మానీర్‌ మానీర్‌ విలియమ్స్‌ నిఘంటువులో నిర్వచనం సూచిస్తున్నది. [ మూలం: పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]

అండజ/శ్వేతగరుత్తువు

నానార్థాలు
సంబంధిత పదాలు
  • హంసపాదము
  • హంసతూలిక
  • హంసలూలికాతల్పము
  • హంసవాహనుడు
వ్యతిరేక పదాలు
  1. హంసగమన, హంసగామిని or హంసయాన

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"రాజహంసలు గాని రాజహంసలుకారు." నిలువవే వాలు కనుల దాన, వయ్యారి హంస నడక దాన.......===== ఇది ఒక సిని గీత పాదం.

  • స్త్రీ, హంసనడక వంటి నడక గలది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు, 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హంస&oldid=962610" నుండి వెలికితీశారు