Jump to content

అంధుడికి అద్దం చూపించినట్లు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సంధర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.