అంబరీషుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఒక ఋషి
  • సూర్యునికి మరొ పేరు
అస్తమిస్తున్న సూర్యుడు
  • అంబరీషుఁడు తండ్రి మాంధాత. కొడుకు యౌవనాశ్వుఁడు.
  • అంబరీషుడు రెండవ నాభాగుని కొడుకు. నభగుని పౌత్రుడు. ఇతఁడు కేవలము హరిభక్తుఁడు. ఒకప్పుడు ఇతఁడు ద్వాదశీవ్రతము చేయుచుండు నవసరమున దుర్వాసుఁడను మహర్షి ఇతని యొద్దకు వచ్చి భోజనమునకయి ప్రార్థింపఁబడి యమునయందు స్నాన మాచరింపఁబోయి అందుండి శీఘ్రముగ రామింజేసి ద్వాదశి గడియలు మీఱకమున్న ఆహారము పుచ్చుకొనవలసి యుండుటవలన ఈయంబరీషుఁడు బ్రాహ్మణుల యనుమతిని జలపానము చేసె. అది తెలిసికొని దుర్వాసుఁడు కోపగించి అంబరీషుఁడు భస్మమగునటులు దనజడ యొకటి తీసివైచె. అది విష్ణువు ఎఱిఁగి అంబరీషునిని కాపాడుటకు తనచక్రమును పంపెను. అంత ఆచక్రము ఆజడను భస్మము చేసినదేకాక దుర్వాసుని తఱుముటకు ఆరంభింపఁగా అతఁడు మూడులోకములు తిరిగితిరిచి వేసాఱి బ్రహ్మరుద్రులచే జాఱ విడువంబడి భక్తపరాధీనుండగు విష్ణువుచే అంబరీషునిపాలికి పనుపఁబడ అతఁడు చక్రమును స్తుతించి దుర్వాసుని కాపాడెను. ఈయంబరీషునకు విరూపుడు, కేతుమంతుడు, శంబుడు అను మూవురు కొడుకులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]