ఋషి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఋషి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు./ ఋషి
- 1. జ్ఞానార్జనలో అత్యున్నత స్థితిని చేరిన సాధకుడు. (ఋషతీతి ఋషిః); జ్ఞానం సంపాదించి, యజ్ఞాది వైదిక క్రియల ద్వారా, తపస్సు ద్వారా సిద్ధింపజేసుకొనే ఒక స్థితి ఋషిత్వం. (ఋషతి జ్ఞానేన సంసార పారం). దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అని మూడు తరగతుల వారు ఇందులో ఉన్నారు. నారదుడు దేవర్షి. వసిష్ఠుడు బ్రహ్మర్షి. జనకుడు రాజర్షి. ఆకాశంలో సప్తర్షి మండలం ప్రసిద్ధం. ఒక మన్వంతరంలో ఒక చోట ఉన్న మహర్షులు మరొక మన్వంతరంలో మార్పులు చేర్పులతో మరో చోట ఉండవచ్చు. ఉదాహరణకు ఒక మన్వంతరంలో (మహాభారతం ప్రకారం) మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వసిష్ఠుడు. మరొక మన్వంతరంలో (బ్రాహ్మణాల ప్రకారం) గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి. హరివంశంలో మరికొన్ని మన్వంతరాల సప్తర్షి గణాల పేర్లు ఉన్నాయి. (మా.మా.వి.) ఋషులు మూడు కాదు ఏడు తెగలనే మరొక వాదం ఉంది. మహర్షి, పరమర్షి, శ్రుతర్షి, కాండర్షి అనే తరగతులను దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి తరగతులకు చేరిస్తే మొత్తం ఏడు తరగతుల వారు లెక్కకు వస్తారు. (మా.మా. వి.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఋష్యాశ్రమం/
- ఋషిపుంగవుడు
- ఋషిపత్ని
- ఋషికుమారుడు
- ఋషిప్రోక్తము.
- రుష్యపుంగవుడు,
- పర్యాయపదాలు: అడవినెలవరి, అనుకంప్యుడు, ఉదాస్థితుడు, ఊర్ధ్వరేతసుడు, కచ్చకాడు, కుటపుడు, ఖదిరుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కావ్య రాయలంటే సమదృష్టి కావాలి.(నానృషి కురుతే కావ్యం).అంటే ఋషి కాని వాడు కావ్యం రాయలేడు.
- కృషి వుంటే మనుషులు ఋషులౌతారు...... ఒక పాటలో పద ప్రయోగము