Jump to content

అటునుండి నరుక్కు రా

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు 'అటు నుండి నరుక్కు రా' అంటే 'కాదు అటు నుండే రా' అని ఆ తలారిని ప్రాధేయ పడ్డారట. కొంత మందిని నరికిన తరవాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ అన్నమాట. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. (ఈ విషయమై వివరాలకు మంగళగిరి పేజీ చూడండి.)

ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు.