అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. మజ్జిగ వంటి వాటిని నిలవ ఉంచేందుకు వాడుతారు. కోడలికి అత్త మీద కోపం వచ్చిందంట, కానీ ఏమి చేస్తుంది పాపం అత్తేమో పెద్దావిడ, ఏమన్నా అందామా అంటే మొగుడు ఊరుకోడు అందుకని ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ విసిరి పగలకొట్టిందట.
అందుకనే సాధారణంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినప్పుడు అంటారు, "అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు" అని. ఉదాహరణకు ఆఫీసులో బాసు తిట్టాడని ఇంట్లో భార్యని విసుక్కునేవారు.