అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
లేని దానికోసం కక్కుర్తి పడేవారిని చూసి ఈ సామెత చెపుతుంటారు.
ఉన్నదీ పోయె, ఉంచుకున్నదీ పోయె అనేసామెతను కూడా ఇదే సందర్భంలో ఉపయోగిస్తారు. దీని వెనక ఒక చిన్న కథ కూడా ఉన్నది.
అనగా అనగా ఒక చిన్న ఊరు. ఆ ఊరి నుండి ఒక జంట పక్క ఊరు వెళ్ళేందుకు బట్టలు సర్దుకొని ప్రయాణము అవుతారు. దారిలో మరొక జంట వీరిని కలిసి, ఇప్పుడే వస్తాము మా సామాను చూస్తూ ఉండమని అడిగి, పాత బట్టలు ధరించి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని వస్తారు! ఇది చూసి ఆశ్చర్యపోయిన మన పాత జంట "ఏమిటి విషయము" అని అడిగితే.., ఫలానా జమిందారు పేదవారికి అన్న వస్త్రాలు దానం చేస్తున్నాడు అని చెప్పి, అందుకనే మేము పేదవారిలాగా వెళ్ళి అతను ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకున్నాము అని చెప్తారు.
దీనితో మన జంట కి కూడా ఆశ పుట్టి బట్టలన్నీ మూట కట్టి వారికి అప్పగించి పాత దుస్తులు ధరించి వెళ్తారు. వెళ్తే ఏముంది.., జమీందారూ లేడు.. కొత్త బట్టలూ లేవు. ఈసురోమంటూ వెనక్కి వచ్చి చూస్తే.. వాళ్ళ దుస్తులు తీసుకుని కొత్త జంట ఎప్పుడో ఉడాయించారు. అందుకే అంటారు అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట అని.