అపరాధము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అపరాదము అనగా తప్పు అని సామాన్యార్థం. కాని, పారమార్థికార్థం - (1) చేయకూడని... దైవం విషయంలో చేసే తప్పులు, అంటే భగవదారాధనలోచేసే తప్పులు ముప్పది రెండింటిని ఒక పట్టికగా తయారు చేశారు. అవి: 1. దేవాలయంలోకి చెప్పులతో గానీ, వాహనాలు ఎక్కిగానీ ప్రవేశించడం, 2. దేవుళ్ళ ఉత్సవాలలోగానీ, ఊరేగింపులలోగానీ అవకాశం ఉండికూడా సేవ చేయకుండా ఉండటం, 3. దేవుని ఎదుట నమస్కారం చేయకుండా ఉండటం, 4. అశుచిగా ఉండిగానీ, ఎంగిలి చేతులతో గానీ దేవుని ఎదుటికి వెళ్లి మొక్కడం, 5. రెండవ చేయిని (ఉండికూడా) ఉపయోగించ కుండా ఒక్క చేతితో మొక్కడం, 6. దేవుని సమక్షంలోనే అడ్డదిడ్డంగా తిరగడం, 7. కాళ్లు బార చాచి కూర్చోవడం, 8. పర్యంక బంధనం (యోగ పట్టా/ యోగ పట్టె), 9. పడుకోవడం, 10. తినడం, 11, అబద్ధాలు మాట్లాడటం, 12. పెద్దగా మాట్లాడటం, 13. పరస్పరం వాదులాడు కోవడం, 14. ఏడవటం, 15. పోట్లాడు కోవడం, 16. శిక్షించడం, 17. అను గ్రహించడం, 18. పరుషంగా మాట్లాడటం, 19. ఉన్ని దుప్పట్లు (శాలువలు) కప్పు కోవడం, 20. సంకీర్తనం చేయకుండా ఉండటం, 21. అశ్లీలాలు మాట్లాడటం, 22. దుర్గంధం వ్యాపింపజేయడం (అపాన వాయువు వదలడం), 23. కాలు విూద కాలు వేసుకొని కూర్చోవడం, 24. ఎవరినైనా పొగడటం, 25. ఎవరినైనా నిందించడం, 26. తనను గురించి తాను గొప్పలు చెప్పడం, 27. శక్తి కొలది గాక, లాంఛనంగా పూజ చేశామనిపించుకొనే విధంగా పూజించడం, 28. నైవేద్యం పెట్టకముందే తినేయడం, 29. ఆయా కాలాలలో లభించే ఫల పుష్పాలను దేవుడికి సమర్పించకపోవడం, 30. దేవుడి ముందుండి లౌకిక వ్యవహారాలను గురించి చర్చించడం, 31. ఏదైనా మిగిలితే అది దేవుడికి ఇవ్వడం, అంటే సంకల్పం చేసినట్టుగాక ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఎంతోకొంత ఇవ్వడం, 32. గురువు సమక్షంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు మౌనం పాటించడం. ఇవన్నీ భగవదపచారాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అపరాధము&oldid=950978" నుండి వెలికితీశారు