అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఆచరించవలసిన ధర్మం నిర్వర్తించకుండా అన్య ధర్మాలు పాటించేవాళ్ళనుద్దేశించిన సామెత ఇది. మన తల్లికి కనీసావసరమైన తిండి ఇవ్వడం మన కనీస కర్తవ్యం. మన పెద్దమ్మ (అమ్మకి అక్క) బాగోగులు మన ప్రాథమిక కర్తవ్యం కాదు. మనమీద ఆధారపడిన వాళ్ళ సంగతి చూసాక చేయవలసిన పని. కాని, తల్లికి కూడు పెట్టకుండా, పెద్దమ్మకి బట్టలు కొనడం ఎంత ఉచితం?
ఈ సామెతకి ఇంకో రూపాంతరం ఉంది. అది: అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతాడా? అసలు ధర్మమే నిర్వర్తించని వాడి నుండి వేరేమి ఆశించగలం అని భావం.