అలవోక
Jump to navigation
Jump to search
ఇతర భాషల అనువాదాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
క్రి.విణ./విశేష్యము
- వ్యుత్పత్తి
ద్వ.వి. (అల+పోక.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
స్వేచ్ఛ, లీల, నిబ్బరము, నిర్లక్ష్యము.
- యధృచ్ఛ,/ అప్రయత్నము...................వావిళ్ల నిఘంటువు
- 1. అప్రయత్నము.
- 2. విలాసము.
- 3. నిర్లక్ష్యము. ...................తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- 1. అప్రయత్నముగా.
- 2. హఠాత్తుగా.
- 3. సవిలాసముగా.
- 4. అనాయాసముగా.
- 5. నిర్లక్ష్యముగా. ......................ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
3"తే. పొంది నారదముని యలవోక నచటి, కరుగుదెంచిన..." భార.శాం. ౬,ఆ. ౧౨౭. 3"వ. మదాశయుండనువాఁడు రూపానుభూతియను భార్యయుం దాను ధీరభావుండను మంత్రితోడ నలవోక నటుపొలసినమాత్రఁ గళాపూర్ణుం డాధీరభావుని దన ధనుర్విలాసంబునం బలాయనంబ నొందించి మదాయునతని భార్యతోడఁ గూడ నొక్కించుక ప్రవర్తించె" కళా. ౫,ఆ. ౪౦;
- లీల, విలాసము.=="సీ. కెంజాయరంజిల్లులోచనములలర, నాజగన్నాథుల నలవోకవోలెఁ గన్గొని దక్షిణమునకుఁ జన." భార.ద్రోణ. ౨,ఆ. ౧౬౬.
- "సీ. నీకతంబునఁగాదె కాకోలవిషవహ్ని నలవోకయునుబోలె నార్పఁగలిగె." కాశీ. ౬,ఆ. ౯౬;
- 3. అశ్రద్ధ;=="చ. అనిమిషనాథుతోడి యని యప్పుడు గంటి ననంతు నాద్యువి,ష్ణుని నలవోకఁ దన్మహిమ సువ్రతనా కెఱిఁగింపు." భార.శాం. ౫,ఆ. ౪౦౬;