ఉత్ప్రేక్ష
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/రూ-ఉత్ప్రేక్షము.
- వ్యుత్పత్తి
సంస్కృత సమం
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక అర్థాలంకారము
- వివరణ: ఒకానొక అర్థాలంకారము, అప్రస్తుత వస్తువు యొక్క గుణము, క్రియ మొదలగువాని సంబంధముచేఁ బ్రస్తుత వస్తువును నప్రస్తుతముగానెంచుట యుత్ప్రేక్షాలంకారము. ఈ యలంకారమునకు ధర్మము అప్రసిద్ధము. ఉపమానమందుఁ బ్రసిద్ధము. దీనింబట్టియే ఈ రెండలంకారములకు భేదము. ఇది వాచ్యమని, గమ్యమని రెండు తెఱఁగుల నుండును. తలంచెద, ఎంచెద, సత్యము, అదియో, అనునట్లు - ఇత్యాదు లుత్ప్రేక్షావాచకములు. ఇవి గలిగియున్న యెడల వాచ్యోత్ప్రేక్ష, లేని యెడల గమ్యోత్ప్రేక్ష;
- [ఉదాహరణములు: 1. భూదేవి ధరించిన సముద్రమనెడు యొడ్డాణంబుననుండు రత్నపు మొలక యున్నట్లు రత్నగోపురంబుల నొప్పు ద్వారక విలసిల్లె; 2. ప్రాగ్దిక్కను నింతి లలాటంబున నొప్పుచున్న సిందూరపుతిలకంబన సూర్యుండుదయించె; 3. అమ్మాయాకురంగము రాముని కడకేగి యోరామా! తొల్లి నీచే నిడుమలఁ బడియు మఱల గడ్డిఁదినవచ్చితినని చెప్పుచున్నదియో యనఁ దృణాంకురముల మేయసాగెను; 4. అట్టి వర్షాకాలంబునఁ దొలిదొలివానచేఁ బుడమినండి యావిరి యెండవేఁడిమిఁ బోవ నిట్టూర్పుపొవలున నెగసె; 5. ఆకాశమను నేనుఁగును సూర్యుఁడను మావటీఁ డస్తాద్రిపై వలలవైచిన వెతఁగుడిచి క్రక్కినరక్తమో యనునట్లు సాంధ్యరాగమొలసె;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- హెచ్చరికలేమి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు