Jump to content

ఉపమ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

ఉభయము,వైక్ర్తము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. అర్థాలంకారము (రూ-ఉపమానము)
చూ, అలంకారము.3. సమస్తాలంకారములకు నుపమ పూర్ణాదిగా నున్నది. దాని నుండియే సమస్తాలంకారములును బుట్టినవి. రెండు పదార్థములయందు వర్ణ్యావర్ణ్యములందు మనోహరమగు సామ్యమును స్పష్టముగాఁ జెప్పబడి యుండెనేని యుపమయగును.1. ఉపమానము 2. ఉపమేయము 3. ఉపమావాచకము 4. సాధారణ ధర్మము అని నాలు గవయవములు కలవు;

ఉదా. రాముని కీర్తివెన్నెల చల్లనై లోకమున వ్యాపించియున్నది. ఒకదానితో నొకటి పోలిక గల రెండు వస్తువులలో గొప్పదియగు నప్రస్తుతవస్తువు ఉపమానము. అది యిందు వెన్నెల. అది తెలుపుచేత గొప్పదియుఁ బ్రస్తుతము వర్ణించఁబడనదియునై యున్నది కావున నుపమానము. (ఉపమాన=పోలిక : ఉపమేయ=పోల్చఁబడునది : ఉపమావాచక=వలె ప్రభృతులు : సాధారణ ధర్మ(గుణ) ములు కలది పూర్ణోపమ. ఇందులో నేవేని దక్కువైన లుప్తోపమ. మొత్తమున నెనిమిది విధములు. పూర్ణోపమ: ఉ. నీకీర్తి హంసాంగనవలె స్వర్గంగం దేలుచుండె : లుప్తోపమ: ఉ. నీమోము సోమునిం బోలు.)

నానార్థాలు
  • ఒక అర్థాలంకారము
  • ఉత్తరపదమైనచో సమానము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపమ&oldid=910225" నుండి వెలికితీశారు