ఋతం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఈ పదానికి సామాన్యార్థం సత్యం అనే. అయితే, సత్యానికీ, ఋతానికీ మధ్య కొంత వ్యత్యాసం ఉంది. వేదమంత్రాలలో ‘సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి...’ అంటున్నాము. అంటే సత్యానికీ, ఋతానికీ మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తున్నట్టే. సత్యం అన్ని కాలాలలోనూ ఒక్కటే. అది మారదు. అందుకే అది త్రికాలఆబాధితం అన్నారు. ఋతం కూడా సత్యమేగాని, అది కాలానుగుణంగా మారవచ్చు. ఉదాహరణకు అరణ్యంలో ఒక సాధుజంతువు ఒకానొక ముని ఆశ్రమానికి వచ్చి ప్రాణరక్షణకోసం దాగి ఉందను కుందాము. దానిని తరుముకుంటూ వచ్చిన వేటగాడు అడిగితే ముని తనకు తెలియదని చెపితే అది ఋతం అవుతుందా, అనృతం అవుతుందా? ఋతమే అవుతుంది. అనృతం కాదు. కాని, అది సత్యమా అంటే కాదు. సత్యానికీ, ఋతానికి ఇదీ తేడా. దేశ కాల పరిస్థితులను బట్టి ఋతం మారవచ్చు, సత్యం మారదు.
- 2. ప్రకాశమొందినది, మోక్షం, పరబ్రహ్మం మొదలైన అర్థాలు కూడా ఉన్నాయంటున్నది. (శ్రీ. సూ. ఆం. ని.)
- 3. యథార్థ వస్తు చింతన,
- 4. యజ్ఞం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు