కర్మము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముసంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కారకవిశేషము
- పని(కర్మువు).
- కర్మములు పెక్కు రకములు కలవు.
- తర్కశాస్త్రమందలి పంచవిధకర్మలు:ఉత్క్షేపణము,అపక్షేపణము,ఆకుంచనము,ప్రసారణము,గమనము.
- షట్కర్మములు:యజనము,యాజనము,అధ్యయనము,అధ్యాపనము,దానము,ప్రతిగ్రహము.
- షోడకకర్మములు:గర్భాదానము,పుంసవనము,సీమంతము,జాతకర్మము,నామకరణము,అన్నప్రాశనము,చౌలము,ఉపనయనము,ప్రాజాపత్యము,సౌమ్యము,ఆగ్నేయము,వైశ్వదేవము,గోదానము,సమావర్తనము,వివాహము,అంత్యకర్మము.
- కర్మములకు హేతువులు అహంకార మమకారములు. అహంకారము అనగా దేహమందు ఆత్మ అను బుద్ధి. మమకారము అనగా తనవిగాని వానియందు తనవి అను బుద్ధి. ఈఅహంకార మమకారములు "అవిద్య" అని చెప్పఁబడుచున్నవి. గృహారామాదులకును ఆత్మకును సంబంధము ఏమియు లేదు. అవి ఎల్ల దేహానుబంధములు అయినవి. అట్టివాని యందు అభిమానము ఉంచకూడదు. మఱియు సుఖదుఃఖములు పొందక సర్వోదాసీనులు అయి సర్వసముఁడు అయిన ఆపరమేశ్వరుని సేవించువారు మోహమును వదలి అతిశీఘ్రమున ఉత్తమపదము చెందుదురు. అన్యకామ్యధర్మములయందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు అని వచియించుచు ఉండువారు విషమ ధర్మనిరతులు అయి క్షయింతురు. స్థావర జంగమ ప్రాణిసమూహములందు సమము ఐన భాగవత ధర్మమున వర్తించువారు దేహి దేహ స్వరూపములను ఎఱిఁగి నిరస్తాశులు అయి ఈశ్వరానుగ్రహము పడయుదురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు