Jump to content

కార్తవీర్యార్జునుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కార్తవీర్యార్జునుడు య|| హైహయ వంశజాతుఁడు అగు ఒక రాజు. ఇతని పేరు అర్జునుఁడు అయినను కృతవీర్యుని కొడుకు కనుక ఇతనిని కార్తవీర్యార్జునుడు అందురు. వీని రాజధాని వింధ్యపర్వతమునకు దక్షిణమున పాఱునట్టి నర్మదానదీతీరమున ఉండు మాహిష్మతీపురము. ఇతఁడు యదువుయొక్క పెద్దకొడుకు అగు సహస్రజిత్తు వంశస్థుడు. ఒకప్పుడు ఇతని పరాక్రమమును రావణాసురుడు విని ఇతనితో పోరకోరి మాహిష్మతికి వచ్చెను. ఆదినమున ఇతఁడు వనవిహారార్థము పోయి ఉండఁగా పురజనుల వలన ఆవృత్తాంతము విని తన రాక తెలిసి అర్జునుడు దాఁగెను అని నవ్వుచు పోయి వింధ్యారణ్యమునందు విహరించుచు కొంతసేపటికి నర్మద ఒడ్డునకు వచ్చి అచ్చట శివపూజ కావించుచు ఉండెను. అప్పుడు స్త్రీలతోడ జలక్రీడలు ఆడుచున్న కార్తవీర్యార్జునుని వేయి చేతుల చేతను అడ్డగింపఁబడి ఎగదట్టిన నర్మదానదీప్రవాహమును తన పూజాద్రవ్యములు ఎల్ల కొట్టుకొని పోయెను. అందుకు కారణము మంత్రులచేత తెలిసికొని రావణుఁడు అతఁడు ఉండిన కడకు పోయి అతనితో పోరాడి పట్టుపడి చెఱను ఉంచఁబడెను. ఆ వృత్తాంతము వాని తాత అగు పులస్త్యుఁడు విని కార్తవీర్యార్జునుని ప్రార్థించి అతనిని విడుదల చేసెను.

       మఱియు ఈకార్తవీర్యార్జునుఁడు పరశురాముని తండ్రి అగు జమదగ్ని యొక్క హోమధేనువును కొనిపోఁగా అదివిని పరశురాముఁడు వీనితో పోరాడి వీనిని చంపెను. ఆవల కొంతకాలమునకు కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని చంపిరి. అదికారణముగ పరశురాముడు దేశమును అంతయు క్షత్రియశూన్యము కావింతును అని ప్రతిజ్ఞ చేసి ఇరువదియొక్క మాఱు క్షత్రియులమీఁద దండెత్తి పోరాడి రాజులను ఎల్ల వెదకివెదకి చంపి ఆనెత్తురు అయిదు మడుఁగులుగ కావించి అందు పితృతర్పణములు చేసెను. కార్తవీర్యార్జునునకు అనేకులు పుత్రులు కలరు. అందు పరశురామునిచే చావక తప్పినవారు జయధ్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, శూరుడు (లేక) ఊర్జితుడు అనువారు ఏవురు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]