Jump to content

జమదగ్ని

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. జమదగ్ని భృగువంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.
ఒక మహర్షి. ఇతని తండ్రి ఋచికుడు. తల్లి గాధిరాజు కూతురు అగు సత్యవతి (కౌశికి). కొడుకులు ఉరుమతి, ఉత్సాహుడు, విశ్వావసుడు, పరశురాముడు అని నలుగురు. అందు పరశురాముఁడు ముఖ్యుఁడు. జమదగ్ని తండ్రి అగు ఋచికుడు సత్యవతిని పెండ్లాడి కన్యాకుబ్జమునందు ఉండి సంతానమును కోరి తనకని ఒక చరువును (చరువు = హోమమునకు తగిన పక్వాన్నము) తన మామకని ఒక చరువును కల్పించి ఆరెంటిని తన భార్యముందర పెట్టి, రాజులకు గెలువరానివాఁడును రాజులనెల్ల నాశము చేయువాడును అగు కొడుకు దీనివలన జనించును, ఈచరువును మీ తల్లికి ఇమ్ము; తపస్సంపత్తియు శమంబును కల సుపుత్రుఁడు దీనివలన పుట్టును, ఈచరువు నీవు కైకొనుము; అని తెలియ చెప్పి అతఁడు స్నానార్థము నదికి చనియెను. అంతట తీర్థయాత్ర చేయ పోయి ఉండిన గాధి, తన భార్యతో కూడ అచ్చటికి వచ్చెను. సత్యవతి అట్లు వచ్చిన తల్లిదండ్రులను చూచి సంతసించి తన పెనిమిటి చేసిన రెండుచరువులను తల్లికి చూపి వాని ప్రభావమును చెప్పెను. అందులకు ఆమె సంతోషించి తన కూఁతుతోడ తానును స్నానముచేసి శుచియై, ఇది తనది ఇది కొమార్తది అను భేదము తెలియక, తన చరువు కూఁతునకు ఇచ్చి కూఁతు చరువు తాను ఉపయోగించెను. సత్యవతియును ఆభేదము మఱచి తల్లి ఇచ్చినదానినే పుచ్చుకొనెను. అంత ఋచికుఁడు వచ్చి భార్యను చూచి తన దివ్వజ్ఞానముచేత చరువులు మాఱుట తెలిసికొని నీవు క్షత్రియనాశకరము అగు గర్భమును తాల్చితివి అనఁగా ఆమె వెఱచి అతని పాదములమీఁద పడి మీరు ఇట్లు చెప్పవచ్చునా అని అడిగెను. అంత అతఁడు 'ఇది నీవల్ల వచ్చిన తప్పుకాదు నీ తల్లివలన అయిన తప్పు. చరువ్యత్యాసముచేత నీకు క్రూరకర్ముడు అగు కొడుకును మీ తల్లికి బ్రహ్మజ్ఞానసంపన్నుడును తపోధనుడును అగు కొడుకును పుట్టుదురు' అని చెప్పి అందులకు ఆమె దుఃఖింపఁగా 'ఈచరు మహిమము నీ కొడుకునందు పొందక మనుమనియందు ప్రవర్తిల్లెడుగాక' అని అనుగ్రహించెను. అది కారణముగా పరశురాముడు భృగువంశజాతుడు అగు జమదగ్ని మహామునికి జనించియు క్రూరకర్ముడై చలము పట్టి రాజులను ఎల్ల నాశము చేసెను.

జమదగ్ని, తన భార్య అగు రేణుక అంగదేశపు రాజు అగు చిత్రసేనుడు అనువాని మోహించి వ్యభిచరించినందున, కోపించి తన చిన్నకొడుకు అగు పరశురామునిచేత ఆమెను చంపించి, మరల పరశురాముఁడు తన తల్లిని బ్రతికింపవలెను అని ప్రార్థింపఁగా ఆమెను బ్రతికించెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జమదగ్ని&oldid=882747" నుండి వెలికితీశారు