కొమ్ము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

కొమ్ములతో యుద్ధముచేసుకుంటున్న జింకలు
భాషాభాగం
ఆవు కొమ్ములు
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఉకారము యొక్క రూపాంతర నామము; 2. ఎద్దులోనగువాని కొమ్ము; 3. క్రొవ్వునుంచుకొనెడు పాత్రము; 4. పసుపులోనగువాని యెండిన నిడుపాటి గడ్డ; = పసుపుకొమ్ము 5. చిమ్మనగ్రోవి;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
కొమ్ములుతిరిగిన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • "చ. తొడవులు తీసి క్రొమ్మెఱుగుదువ్వలువల్‌ కడవేసి జిల్గుపా, వడలొగిగట్టి మేలినిడువాలికకొమ్ములు వట్టి యుద్దులే, ర్పడగ వగూడి యల్లవలరాయని క్రొవ్విరిఁబోఁడికేని ప్రా, వడని యొయారిదారికను పట్టఁ గొలంకున జేరిరెంతయున్‌." చంద్ర.
 • . పల్లకిబొంగు;

"సీ. మొగలిఱేకల్లిక తొగకాఁడచట్టము కుఱుగన్పుచెఱకు క్రొమ్మెఱుఁగుఁగొమ్ము." (ఇక్కడ అందలము యొక్క వర్ణనము) చంద్రా. ౩, ఆ.

 • (ఏనుఁగు యొక్క దంతము;"ఉ. కొన్నిటి హస్తముల్‌ చదియఁ గొన్నిటిఁగొమ్ములు దుమ్ము ధూళిగా." భార. భీష్మ. ౨, ఆ.
 • పందికోఱ;"సీ. నీటిలోమునిఁగిన నేలచేడియఁ గొమ్ముకొన నుబ్బనెత్తిన ఘోణివీవ." పా. ౧, ఆ.
 • . ఊఁదెడి యొకానొక వాద్యము;"వ. గుమ్మెటల చటులరవమ్మును గొమ్ముల నినదమ్మును జెలంగె." కాళ. ౩, ఆ.
 • శాఖ;\ = "సీ. కలఁచు పున్నాగంబు లలరుఁగొమ్ముల మహోన్నతిగలయ నభీకమతులనైన." హన. ౨, ఆ.
 • . శిఖరము;"క. గుబ్బలికొమ్మొక్కటిఁ గడు, నిబ్బరముగఁ బెఱికియాతనిన్‌ వైచిన వాఁడుబ్బుసెడక మలత్రిమ్మరి, బెబ్బులి పై మొనలవాలు పేర్మిన్‌ వైచెన్‌." అచ్చ. యు, కాం.
 • . కొన; ="సీ. ధనువు క్రిందటి కొమ్ముధరణిపై మోపి మీఁదటికొమ్ము వామహస్తమునఁ బట్టి." భో. ౫, ఆ.
 • . ఉత్సాహము; ="గీ. అంత గోపసింహుఁ డసురకొమ్ములు వట్టి, ధరణిద్రొబ్బిత్రొక్కి దైత్యభటుల, కొమ్మువీడ సురల కొమ్మువర్ధిల వాని, కొమ్ము వెఱికి మొత్తికూల్చె నధిప." భాగ. ౧౦, స్కం. పూ.
 • . బలము; = "క. కొమ్మా దానవనాథుని, కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయము గై, కొమ్మా మెచ్చితినెచ్చెద, గొమ్మా భరణములు నీవు కోరినవెల్లన్‌." భాగ. ౧౦, స్కం. ఉ.
 • . గవుండ్లవాఁడు బందము తగిలించెడు కత్తిపిడికలోని వంకరకొయ్య.
 • . వారందరు కలసి వాని కొమ్ము కాస్తున్నారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొమ్ము&oldid=965674" నుండి వెలికితీశారు