గమిడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గమిడి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- గమిడి అను తెలుగు పదం గ్రామిని లేక గామిక అనే ప్రాకృత భాష నుంచి పుట్టింది. గ్రామిని అనే పదం శాతవాహన కాలంనాటిది.గ్రామిని లేక గామిక లేక గమిడి అనే పదానికి అర్ధం గ్రామ అధికారి.ఈ గామిక అనే పదాన్ని వివరిస్తూ 3వ పులోమావి అనే శాతవాహన రాజు కర్నూల్ జిల్లా మేకదోని లో శాసనం వేశాడు. రాష్ట్రకుట రాజ్య పాలనా కాలం లో గ్రామిని ఉద్యోగం రెడ్లు చేసేవారు అందుకే రెడ్ల లో గమిడి ఇంటిపేరు వారు ఎక్కువ కనిపిస్తారు. అదే కాలానికి సంబంధించి వేంగి చాలుక్య రాజ్యం లో కమ్మ,కాపులు ఎక్కువ గ్రామ అధికారులుగా ఉండేవారు రెడ్లు, కమ్మ, కాపు కులం లో ఎక్కువ గమిడి ఇంటిపేరు ఉన్న వారు కనిపిస్తారు అలాగే యాదవులు, వెలమ,గౌడ్ కులాల్లో కూడా కొన్ని కుటుంబాలు గ్రామాధికారులు గా ఉన్నారు.వారిలో కూడా గమిడి ఇంటిపేరు కనిపిస్తుంది.మాల కులం లో కూడా గ్రామఅధికారులు, తలారులు ఉన్నారు.దీని బట్టి మాల కులం కూడా ఇతర అగ్రకులాల లాగ పరిపాలన రంగం లో ముఖ్యపాత్ర పోషించింది అని చెప్పచు.గమిడి వారు ఆ కాలం లో గ్రామం లో వారికీ సమాన హోదా గల తలారులతో, గ్రామ అకౌంటెంట్ గా పనిచేసే కరణాలతో వివాహ సంబంధం కాలుపు కునేవారు