చర్చ:మక్కీ
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
మక్కీ అనే పదము హిందీ భాషా పదము కాదు. తెలుగులో "ఈగ" కు హిందీలో "మఖ్ఖీ" అని అంటారు. సాదా "క" కు బదులు వత్తు "ఖ" వుంటుంది. కావున నిర్వాహకులు దీనిని సరిదిద్దవలసినది. మక్కీ అనేపదము ఉర్దూ, ఫార్సీ మరియు అరబ్బీలో కానవస్తుంది. "మక్కీ" అనగా "మక్కా" కు చెందిన. ఉదాహరణకు హైదరాబాదుకు చెందిన వారిని "హైదరాబాదీ" అంటారు, అలాగే "మక్కా" కు చెందినవారిని "మక్కీ" అని, మదీనాకు చెందినవారిని "మదనీ" అని, దెహ్లీ (ఢిల్లీ) కు చెందినవారిని "దెహ్లవీ" అని, మద్రాసుకు చెందినవారిని "మద్రాసీ" అని వ్యవహరిస్తారు. " మక్కీ కి మక్కీ " అనే సామెతలోని మక్కీ 'ఈగ ' యే, కాని తెలుగు వ్యావహారికంలో మఖ్ఖీని "మక్కీ" అనే పిలిచే "వ్యావహారిక అలవాటు" మాత్రమే. అహ్మద్ నిసార్ (చర్చ) 19:30, 28 నవంబరు 2013 (UTC)
- అహ్మద్ నిసార్ గారు, మీ సూచనలు తప్పక అనుసరించి అమలు పరచుదాము. ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 22:26, 28 నవంబరు 2013 (UTC)S